రిజల్ట్ పోతున్నా డిమాండ్ తగ్గట్లేదు

Thu Dec 13 2018 13:48:48 GMT+0530 (IST)

Mehreen Gets Huge Demands After Gets Flops

సినిమా పరిశ్రమే అంత. జయాపజయాలతో సంబంధం లేకుండా ఒక్కోసారి కొందరి కెరీర్ల ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. మెహ్రీన్ ను చూస్తే ఇది అక్షరాల నిజమే అనిపిస్తుంది. ఇప్పటిదాకా ఈ భామ కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాలు రెండే. ఒకటి కృష్ణగాడి వీరప్రేమ గాధ మిగిలింది రాజా ది గ్రేట్. అవి మినహాయించి గట్టిగా చెప్పుకోదగిన సక్సెస్ ఏదీ లేదు. మొన్నే వచ్చిన కవచంలో హీరొయిన్ అని కూడా చెప్పుకోలేని పాత్ర.అంతకు ముందు యూత్ లో పిచ్చ క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండతో చేసిన నోటా దారుణ ఫలితాన్ని ఇచ్చింది. గోపీచంద్ 25వ సినిమాగా ప్రచారం జరిగిన పంతం వల్ల ఒరిగింది కూడా శూన్యం. ఇంకాస్త వెనక్కు వెళ్తే సాయి ధరం తేజ్ జవాన్ సందీప్ కిషన్ కేరాఫ్ సూర్య లాంటివన్నీ క్యు కట్టి కనిపిస్తాయి. అయితే ఈ ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా అమ్మడి రెమ్యునరేషన్ మాత్రం పీక్స్ లో ఉందట. మొహమాటం లేకుండా 75 లక్షల దాకా చార్జ్ చేస్తున్నట్టు సమాచారం. జిఎస్టి ఫ్లైట్ చార్జీలు లాంటివి అదనంగా ఉంటాయనుకోండి అది వేరే విషయం.

అందుకే నిర్మతలు మెహ్రీన్ ను తీసుకునే విషయంలో ఈ ధరకు సిద్ధపడితేనే వెళ్తారట. మెహ్రీన్ మాత్రం ఇప్పటి దాకా ఒక ఎత్తు వెంకటేష్ వరుణ్ తేజ్ ల ఎఫ్2 లో మెగా హీరో తో జోడిగా నటించిన ఎఫ్2 ఒక ఎత్తు అని ఫీలవుతోంది. ఇది కనక పెద్ద హిట్ అయితే బ్రేకులు లేకుండా ఆఫర్లు వస్తాయనే అంచనాలో ఉందట. అయినా ఇన్నేసి ఫ్లాపులు వస్తున్నా మెహ్రీన్ ఇలా డైరీ ని బిజీ గా మైంటైన్ చేయడం అంటే విశేషమేగా