Begin typing your search above and press return to search.

మెహర్ మెగా రీమేక్ షూట్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడా..?

By:  Tupaki Desk   |   19 Jun 2021 10:30 AM GMT
మెహర్ మెగా రీమేక్ షూట్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడా..?
X
మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. గతేడాదే ఈ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ వచ్చేసింది. 'శక్తి' 'షాడో' వంటి భారీ పరాజయాల తర్వాత చాలా గ్యాప్ తర్వాత మెహర్ దర్శకత్వం వహించబోయే సినిమా ఇది. ప్లాప్ డైరెక్టర్ గా ముద్ర పడినప్పటికీ.. తమ్ముడి వరసయ్యే మెహర్ పై నమ్మకంతో చిరు ఈ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని కోసం తమిళ్ లో సూపర్ హిట్ అయిన 'వేదలమ్' రీమేక్ ని ఎంచుకున్నారు. ఈ స్క్రిప్ట్ మీద దాదాపు మూడేళ్ళ పాటు వర్క్ చేసిన మెహర్.. మెగాస్టార్ ఇమేజ్ కు తగినట్లు మార్పులు చేర్పులు చేశారట. 'ఆచార్య' లేట్ అవుతూ వస్తుండటం.. మధ్యలో ‘లూసిఫర్’ రీమేక్ లైన్ లోకి రావడంతో మెహర్ సినిమా ఆలస్యం అవుతోంది. అయితే ఈ సినిమాని అధికారికంగా ప్రారంభించనప్పటికీ.. దర్శకుడు ఆల్రెడీ కొంత షూటింగ్ చేశారని ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త వినిపిస్తోంది.

'వేదళమ్' రీమేక్ కథానుసారం కలకత్తా బ్యాక్ డ్రాప్ లో కొన్ని సన్నివేశాలు షూట్ చేయాల్సి ఉందట. ఈ నేపథ్యంలో గతేడాది కోల్‌కతాలో ఘనంగా జరిగిన దేవీ నవరాత్రుల సమయంలో మెహర్ రమేష్ తన బృందంతో వెళ్లి కొన్ని మాంటేజ్ షార్ట్స్ షూట్ చేశారట. దీని కోసం భారీగానే ఖర్చు చేసినట్లు టాక్. హై బడ్జెట్ లో సినిమాలు తీసే మెహర్ రమేష్ మెగాస్టార్ తో రూపొందించే సినిమాని కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో సిస్టర్ సెంటిమెంట్ తో పాటు ఇతర కమర్షియల్ అంశాలన్నీ ఉండేలా చూసుకుంటున్నాడట. మరి మెగా రీమేక్ తో హిట్ కొట్టి మెహర్ ప్లాప్ దర్శకుడనే ముద్ర తొలగించుకుంటాడేమో చూడాలి. ఇకపోతే ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించనున్నారట. త్వరలోనే 'లూసిఫర్' రీమేక్ ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్న చిరంజీవి.. ప్యారలల్ గా వేదళమ్ రీమేక్ ని కూడా స్టార్ట్ చేస్తాడేమో చూడాలి.