ఫొటోటాక్ : ముద్దుగుమ్మ 3M సెలబ్రేషన్స్

Thu Sep 16 2021 16:00:01 GMT+0530 (IST)

Megha Akash Instagram 3M Celebrations?

నితిన్ నటించిన 'లై' సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ మేఘ ఆకాష్. ఆ సినిమా నిరాశ పర్చినా కూడా వెంటనే నితిన్ ఆమెకు 'ఛల్ మోహన్ రంగా' సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఆ రెండు సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్ ఆమెకు ప్లాప్ గానే మిగిలాయి. దాంతో తెలుగు లో ఈమెను పెద్ద హీరోలు లైట్ తీసుకున్నారు. అయితే అనూహ్యంగా ఈమెకు తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ పేటా లో కీలక పాత్రలో నటించే అవకాశం దక్కింది. సూపర్ స్టార్ మూవీ తో తమిళ ఎంట్రీ ఇచ్చిన మేఘ ఆకాష్ కు అక్కడ వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. స్టార్ హీరోలు ఈమెతో నటించేందుకు సిద్దంగా ఉన్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న సినిమాలను ఈమె చేస్తూ వస్తోంది.శింబు.. ధనుష్ ఇంకా పలువురు యంగ్ స్టార్స్ తో సినిమాలు చేసి తమిళంలో క్రేజీ హీరోయిన్ ల జాబితాలో చేరిపోయింది. ఈ సమయంలోనే డియర్ మేఘ సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా యావరేజ్ టాక్ ను దక్కించుకుంది. తెలుగు లో మళ్లీ నిరాశ ఎదురైనా కూడా ఈమె ప్రస్తుతం తమిళంలో పలు సినిమాల్లో నటిస్తోంది. ఈమె చేతిలో నాలుగు తమిళ సినిమాలతో పాటు ఒక తెలుగు సినిమా కూడా ఉంది. ఇప్పటికే హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చిన మేఘకు అక్కడ కూడా ఒకటి రెండు చిన్న చిన్న ఆఫర్లు వస్తున్నాయట. మొత్తంగా కెరీర్ లో చాలా బిజీగా ఉన్న మేఘ ఆకాష్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ అనే విషయం తెల్సిందే.

తాజాగా మేఘ ఆకాష్ సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య మూడు మిలియన్ లకు చేరింది. ఆమె ఇన్ స్టా గ్రామ్ లో మూడు మిలియన్ ల మంది ఫాలోవర్స్ ను దక్కించుకున్న సందర్బంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెబుతూ పోస్ట్ షేర్ చేసింది. బీచ్ లో లవ్ సింబల్ వేసి అందులో పూలతో అలంకరించి మూడు మిలియన్ లు అని రాసి ఇన్ స్టా సింబల్ ను వేసింది. మూడు మిలియన్ ల మంది ఫాలోవర్స్ దక్కినందుకు ఆమె సంతోషంతో సన్నిహితులకు పార్టీ ఇచ్చి సెలబ్రేషన్ చేసుకుంది. ఈమద్య కాలంలో సోషల్ మీడియా ఫాలోవర్స్ ఆధారంగా స్టార్ డమ్ నిర్థారిస్తున్నారు. అందుకే మేఘా ఆకాష్ మూడు మిలియన్ ఫాలోవర్స్ తో క్రేజీ హీరోయిన్ గా మరింతగా జనాలకు చేరువ అవుతోంది.