ఫోటో స్టొరీ: మెరూన్ చీరలో కిరాక్ నారీమణి

Tue Mar 26 2019 19:18:41 GMT+0530 (IST)

Megha Akash Glamourous pose in Saree

మేఘా ఆకాష్ అని మీరు గూగూల్ సెర్చ్ లో టైప్ చేస్తే ఏమౌతుంది? టైప్ చేసే సమయంలో గూగుల్ కింద కొన్ని పాపులర్ సజెషన్స్ చూపిస్తుంది కదా.. వాటిలో ఒక సజెషన్ 'మేఘా ఆకాష్ నేవల్' అంటే పాప నాభి సౌందర్యం ఫోటోలను నెటిజనులు తెగ వెతుకుతున్నారు.  మన తెలుగు వారిలో ఒకే ఒక్క రాఘవేంద్రరావు గారు మాత్రమే ఉంటారు పొరపాటుపడుతున్నాం కానీ .. ఈ జెనరేషన్ నెటిజనులలో సగం మంది రాఘవేంద్రరావులు ఉన్నట్టున్నారు! ఇంకా నయం.. వీరిని ఇలాగే పట్టించుకోకుండా వదిలేస్తే  బిగ్ బాస్కెట్ లో బత్తాయిల ఆర్డర్ కూడా పెడతారేమో!ఇంత సోది ఇంట్రో చెప్పిన తర్వాత కూడా ఇంకా ఈ పాప ఎవరు అని మీరడిగితే.. నితిన్ హీరోగా నటించిన 'లై'.. 'ఛల్ మోహన్ రంగా' సినిమాల్లో హీరోయిన్ అని చెప్పాలి.  ఆ సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు కానీ మేఘ మాత్రం తమిళంలో బిజీ అయిపోయింది.  జనవరిలో రిలీజ్ అయిన రజనీకాంత్ 'పేట' లో కూడా నటించింది.  మేఘ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.  రీసెంట్ గా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటోను పోస్ట్ చేసింది.  దానికి ఆమె ఇచ్చిన క్యాప్షన్ "ఇది నా ఫేవరెట్స్ లో ఒకటి.  #విండ్ ఇన్ ది హెయిర్".  గాలికి అలా కదిలి నుదుటిపై పడిన ముంగురులు అన్నమాట.  మెరూన్ కలర్ శారీ...  అదే రంగులో నిలువు గీతలు ఉండే జాకెట్ లో పూర్తిగా ట్రెడిషనల్ గా.. ఫుల్ రొమాంటిక్ గా ఉంది. మెడలో వెడల్పాటి నెక్లెస్.. లైట్ కలర్ లిప్ స్టిక్ తో అందాలబొమ్మలా ఉంది.  అయినా ఫుల్ గా డ్రెస్ వేసుకుంటే హాట్ గా ఉండరని ఎవరైనా అంటే.. అలాంటివాళ్ళు ఉంటే ఈ ఫోటోను చూపించాలి.. బుద్ధి తెచ్చుకుంటారు.. మేఘ ఘన సౌందర్యానికి ఫ్లాట్ అయిపోతారు.

ఇలాంటి ఫోటో పెడితే నెటిజనులకు పిచ్చెక్కదా? ఇప్పటివరకూ దాదాపు రెండు లక్షల లైకులు కొట్టారు. అమేజింగ్ అని.. బ్యూటీ ఆన్ ఫైర్ అని ఏవేవో కామెంట్లు పెట్టారు. నాభి సౌందర్యం చూపించకుండానే ఇలా అయిపోయారంటే..హాటు అవతారంలో కనిపిస్తే చచ్చిపోతారేమో పాపం.  ఇదిసరే.. పాప కొత్త సినిమాల విషయానికి స్తే ధనుష్ 'ఎనై నోకి పాయుం తోటా' ఇంకా రిలీజ్ కావలిసి ఉంది . మరో సినిమా 'ఒరు పక్క కథై'  రిలీజ్ చాలా ఏళ్ళ నుండి పెండింగ్ లో ఉంది.  ఈ రెండు పెండింగ్ సినిమాలను పక్కనబెడితే 'శాటిలైట్ శంకర్' అనే సినిమా తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.