కంపెనీ ఉద్యోగులకు మెగాస్టార్ స్వీట్ వార్నింగ్!

Fri Jul 08 2022 06:00:01 GMT+0530 (IST)

Megastar sweet warning to company employees!

మెగాస్టార్ చిరంజీవి కథనాయకుడిగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయి ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. మెగా లుక్ ప్రేక్షకాభిమానుల్ని ఫిదా చేసింది. చిరు న్యూ లుక్  ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ పోస్టర్ సోషల్  మీడియాలో జోరుగా వైరల్ అయింది. ఇదే సమయంలో చిరంజీవి ట్రోలింగ్ బారిన పడ్డారు.చిరంజీవి పేరులో ఎక్స్  ట్రా గా వచ్చిన 'ఈ' ని పట్టుకుని ఓ రేంజ్లో ట్రోలర్స్  దాడికి దిగారు. దీంతో విషయాన్ని మెగాస్టార్ కాస్త సీరియస్ గానే తీసుకున్నట్లు తాజా సన్నివేశాన్ని బట్టి తెలుస్తోంది. ఆ ఎక్స్ ట్రా ఈ అనేది ఎలా వచ్చిందన్నది తెలియదు గానీ మెగా కాంపౌండ్  మాత్రం సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత న్యూమరాలజీ ప్రకారం ఎక్స్ ట్రా ఈ ని కావాలన ఇరికించినట్లు వచ్చినట్లు ప్రచారం సాగింది.

అటుపై డిజైనర్ తప్పిందం కారణంగా అలా జరిగిందని ప్రచారం సాగింది. ఇందులో ఏది నిజమో తెలియదు గానీ మెగాస్టార్ మాత్రం కొణిదెల కంపెనీ డిజైనింగ్- పీఆర్ టీమ్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిల్మ్స్- కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  ప్రచారం బాధ్యతలు మాత్రం కొణిదెల కంపెనీనే చూస్తుందని  తెలుస్తోంది.

సాధారణంగా ఏ నిర్మాణ సంస్థ భాగస్వామ్యం అయినా కొణిదెల ప్రొడక్షన్ ప్రచారం  పనుల్ని చూస్తుంది. మెగా ఇమేజ్ తో ముడిపడిన విషయం కాబట్టి  ప్రతీ విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తారు. సినిమా ప్రారంభం దగ్గర నుంచి రిలీజ్ వరకూ అప్ డేట్స్ ఎలా ఇవ్వాలి?  పీఆర్ టీమ్ ని ఎలా కో -ఆర్డినేట్ చేయాలన్నది?  పక్కా ప్లానింగ్ ఉంటుంది.

డిజిటల్..ప్రింట్ మీడియాకి వేర్వేరు గా పీఆర్ లు కలిగి ఉంటారు. వాళ్లపైనా  మరో హెడ్ ఉంటారు. వీళ్లందరి ప్లానింగ్ లోనే ప్రతీది జరుగుతుంటుంది. అంతా ఒకే అయిన తర్వాత మీడియాకి రిలీజ్ చేస్తారు.

కానీ ఏకంగా చిరంజీవి పేరు విషయంలోనే ఇలా జరగడం నిజంగా షాకింగ్ అనే అనాలి. ఒక వేళ న్యూమరాజలీ ప్రకారం చూడాలన్నా! గతంలో ఎప్పుడూ ఏ సినిమాకి ఇలా ఎకస్ ట్రా ఈ యాడ్ చేసింది లేదు. ఆ లెక్కన చూస్తే  ప్రూఫ్ రీడింగ్...డిజైనర్ తప్పిందగానే కనిపిస్తుంది.