Begin typing your search above and press return to search.

అక్కినేనిని గుర్తు చేస్తున్న మెగాస్టార్

By:  Tupaki Desk   |   12 July 2020 5:30 AM GMT
అక్కినేనిని గుర్తు చేస్తున్న మెగాస్టార్
X
ఆప‌ద వ‌స్తే.. అనారోగ్యం అని తెలిస్తే ఎవ‌రైనా కుంగిపోతారు. ధైర్యాన్ని కోల్పోతారు. కానీ ఆ ఇద్ద‌రినీ చూస్తే అంద‌రూ మారాలి. అస‌లు త‌మ‌కు ప్ర‌మాద‌క‌ర రుగ్మ‌త ఉంద‌ని తెలిసినా ఎక్క‌డా భ‌యం అన్న‌దే ఆ ఇద్ద‌రిలో క‌నిపించ‌దు. మొక్క‌వోని ధీక్ష‌తో ఎలా ఎదుర్కోవాలి? ఎలా ఫైట్ చేయాలి? అన్న‌ది మాత్ర‌మే ఆ ఇద్ద‌రూ ఆలోచించి అంద‌రిలో స్ఫూర్తిని నింపారు.

ఇందులో ఒక‌రు అక్కినేని అంద‌గాడు ఏఎన్నార్.. ఇంకొకరు బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్. గ్రేట్ ప‌ర్స‌నాలిటీస్ ఎప్రోచ్ ఆల్వేస్ డిఫ‌రెంట్! అన్న చందంగా .. ఆప‌ద వేళ‌ వీళ్ల స్పంద‌న చూస్తుంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌కుండా ఉండ‌దు. త‌మ‌కు అనారోగ్యం అని తెలిసినా.. మ‌హ‌మ్మారీ అని వెల్ల‌డైనా ఎక్క‌డా తొణికిస‌లాడ‌కుండా అంద‌రికీ ధైర్యం చెప్పారు ఆ ఇద్ద‌రూ.. అందుకే వీళ్లు గ్రేట్ ప‌ర్స‌న్స్.

త‌న‌కు క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారీ ఉంద‌ని తెలిసి ఏయ‌న్నార్ (90) ప్రెస్ మీట్ పెట్టారు. హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోస్ కి పాత్రికేయులంద‌రినీ పిలిచి త‌న‌కు ఆరోగ్యం బాలేద‌ని.. క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్నాన‌ని.. అయినా ఎవ‌రూ క‌ల‌త చెందక‌ ధైర్యంగా ఉండాల‌ని కోరారు. ఆయ‌న మీడియా ముందు ఏమాత్రం తొణికిస‌లాట అన్న‌దే లేకుండా గంట‌న్న‌ర‌పాటు ముచ్చ‌ట్లాడి ఆ వ‌య‌సులో ఇదెట్టా! అనేంత‌గా అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆ స‌మ‌యంలో త‌న లైఫ్ జ‌ర్నీలో చివ‌రి చిత్రం `మ‌నం`కి ప్ర‌మోష‌న్ చేశారు అక్కినేని.

ఇక బిగ్ బి అమితాబ్ (77) తీరు అంత‌కు త‌క్కువేమీ కాదు. ఆయ‌న‌కు అనారోగ్యం అని తెలియ‌గానే స్పందించే తీరు ఎంద‌రికో స్ఫూర్తిని నింపుతుంది. ఇంత‌కుముందు చాలా ఇంట‌ర్వ్యూల్లో ఆయ‌న త‌న 20 ఏళ్ల అనారోగ్య పోరాటం గురించి చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. త‌న‌కు టీబీ ఉంద‌ని.. లివ‌ర్ సంబంధిత అనారోగ్యాలున్నాయ‌ని బిగ్ బి చెప్పి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ లైఫ్ ని ఎలా నెట్టుకొచ్చారో వెల్ల‌డించి షాకిచ్చారు. లేటెస్టుగా అమితాబ్ కి క‌రోనా పాజిటివ్ అని తెలియ‌గానే అంద‌రిలో ఒక‌టే టెన్ష‌న్. ముఖ్యంగా అభిమాన‌లు.. సెల‌బ్రిటీలు సైతం ఆయ‌న‌కు ఏమ‌వుతుందోన‌నే ఆందోళ‌న‌లో ఉన్నారు. కానీ అమితాబ్ మాత్రం తాపీగా మీడియా కెమెరా ముందుకు వ‌చ్చి ``ఎవ‌రూ ప్యానిక్ కావొద్దు. నేను ధైర్యంగా ఉన్నాను. పోరాడుతాను.. ఈ యుద్ధంలో అంద‌రం క‌లిసి క‌ట్టుగా పోరాడ‌దాం`` అని ధైర్య‌వ‌చ‌నాలు వ‌ల్లించారు. నిజంగానే ఈ గ‌ట్సీ మ్యాన్ కి హ్యాట్సాఫ్ చెప్ప‌కుండా ఉండ‌లేం. గొప్ప‌వాళ్లు ఊరికే కారు. అది తొణికిస‌లాడ‌ని ధృఢ‌మైన‌ వ్య‌క్తిత్వంతోనే సాధ్యం. ధైర్యంతో పోరాటం సాగించ‌డ‌మే వారు ఎన్నుకున్న ఏకైక మార్గం.