Begin typing your search above and press return to search.

వెంకీ కుడుములని లైన్ లోకి తెచ్చిన మెగాస్టార్

By:  Tupaki Desk   |   27 Jan 2023 9:00 PM GMT
వెంకీ కుడుములని లైన్ లోకి తెచ్చిన మెగాస్టార్
X
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఆరంభంలో వాల్తేర్ వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన క్రేజ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. సరైన మాస్ కమర్షియల్ సినిమా పడితే తనని ఎవరూ ఆపలేరని మెగాస్టార్ ఈ మూవీతో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. నిర్మాతలకి ఈ సినిమా భారీ లాభాలు తెచ్చిపెట్టింది.

ఇక సైరా తర్వాత 2వందల కోట్ల క్లబ్ లో చేరిన చిత్రంగా వాల్తేర్ వీరయ్య నిలిచింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాని చిరంజీవి సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాడు.

ఈ మూవీలో తమన్నా చిరంజీవికి జోడీగా నటిస్తూ ఉండగా, కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలు పాత్రలో కనిపించబోతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. తమిళ్ హిట్ మూవీ వేదాలం రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ సినిమాని వీలైనంత వేగంగా కంప్లీట్ చేసి ఆగష్టు లోపు ప్రేక్షకులకి తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి వెంకీ కుడుముల సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే ఛాన్స్ ఉంది. వెంకీతో గతంలోనే మూవీ ఒకే అయినా కూడా ఎందుకనో ఆ సినిమా ఆగిపోయింది అనే టాక్ వచ్చింది. అయితే అలాంటిదేం లేదని తెలుస్తుంది.

స్టొరీ లైన్ లో కొన్ని కరెక్షన్స్ ని చిరంజీవి చెప్పడం జరిగిందని, వాటిని పూర్తి చేసిన తర్వాత మరోసారి కంప్లీట్ కథని చిరంజీవి వినడానికి రెడీ అవుతున్నట్లు టాక్. ఒకే అయిపోతే భోళా శంకర్ తర్వాత వెంటనే గ్యాప్ లేకుండా ఆ సినిమాని సెట్స్ పైఇ తీసుకెళ్ళే ఛాన్స్ ఉందని టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట.

ఇక వెంకీతో చేయబోతున్నది స్ట్రైట్ కథ అని తెలుస్తుంది. భోళా శంకర్ తర్వాత వీలైనంత వరకు స్ట్రైట్ స్టోరీస్ నే చేయాలని మెగాస్టార్ భావిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.