Begin typing your search above and press return to search.

#గుస‌గుస‌: ప్ర‌భాస్ కు గాడ్ ఫాద‌ర్ గా మెగాస్టార్?

By:  Tupaki Desk   |   10 May 2021 4:30 AM GMT
#గుస‌గుస‌: ప్ర‌భాస్ కు గాడ్ ఫాద‌ర్ గా మెగాస్టార్?
X
టాలీవుడ్ స్థాయి అమాంతం పెరిగింది. బ‌డ్జెట్ లు .. క‌థ‌లు మారాయి. మేకింగ్ స్టైల్ మారింది. పాన్ ఇండియా రేంజు ఇప్పుడు అంతా. `బాహుబ‌లి`- `సైరా న‌ర‌సింహారెడ్డి`- `మ‌హాన‌టి` లాంటి సినిమాల‌కు అంత‌ర్జాతీయ స్థాయి ఖ్యాతికెక్కాయి. తెలుగు సినిమా వైపు ప్ర‌పంచం చూస్తోంది. దానికి త‌గ్గ‌ట్టు టాలీవుడ్ మేక‌ర్స్.. హీరోలు సంసిద్ధ‌మ‌వుతున్నారు. తాజాగా మ‌రో క్రేజీ కాంబినేష‌న్ గురించిన‌ ప్ర‌చారం చూస్తుంటే ఔరా అనాల్సిందే.

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ స‌లార్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వార్త బ‌య‌ట‌కొచ్చిన నాటి నుంచి ప్రాజెక్ట్ పై అసాధార‌ణ అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఓవైపు ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ మ‌రోవైపు తొలి సినిమా కేజీఎఫ్ తోనే పాన్ ఇండియా డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న ప్ర‌శాంత్ కావ‌డం...స‌లార్ లాంటి ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ ప్ర‌క‌ట‌న ఇలా ప్ర‌తీది ఉత్కంఠ పెంచేవే. అందుకే నెవ్వ‌ర్ బిఫోర్ అనేంత‌గా అంచ‌నాలేర్ప‌డ్డాయి. మ‌రి ఇలాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ప్రాజెక్ట్ లో మ‌రో పెద్ద స్టార్ ని దించితే ఎలా ఉంటుంది? అన్న ఆలోచ‌న ప్ర‌శాంత్ నీల్ కి వచ్చింద‌ట‌. అది మెగాస్టార్ చిరంజీవి అయితే ఎలా ఉంటుంది? అన్నది ఊహించ‌నిది.

వెంట‌నే అంగీక‌రించేందుకు ఇది కాస్త క‌ష్ట‌మే... కానీ అలా జ‌రిగితే ఎంత బావుంటుందో అనిపించేంత గొప్ప కాంబినేష‌న్ ఇది. ఇటీవ‌లే మెగాస్టార్- రెబ‌ల్ స్టార్ క‌లిసి దిగిన ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో వైరల్ ‌గా మార‌డంతో అది సందేహాల‌కు తావిచ్చింది. ఈ క‌ల‌యిక దేనికోస‌మో అంటూ గుస‌గుస‌లు వినిపించాయి. తాజాగా స‌లార్ లో మెగాస్టార్ న‌టిస్తున్నార‌ని.. రెబ‌ల్ స్టార్ కి గాడ్ ఫాద‌ర్ పాత్ర‌లో న‌టించ‌డానికి ఓకే చెప్పార‌ని ప్ర‌చారం తెర‌పైకి వచ్చింది. అయితే ఇవేవీ ఇంకా అధికారికం కాదు. కానీ ఆ ఊహే గ‌నుక నిజ‌మైతే మెగా ఫ్యాన్స్ వ‌ర్సెస్ రెబ‌ల్ ఫ్యాన్స్ జోరు ఆప‌త‌ర‌మా?