మెగాస్టార్ 'వేదాలం' రీమేక్ ఉన్నట్లే..నా!

Fri Jan 22 2021 09:00:01 GMT+0530 (IST)

Megastar Vedalam Movie

మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆచార్య సినిమా పూర్తికాకముందే మరో భారీ సినిమాను లైన్ లో పెట్టేసాడు. అదే లూసిఫర్. మోహన్ లాల్ నటించిన మలయాళం లూసిఫర్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతుంది. అయితే ఇటీవలే పూజా కార్యక్రమం పూర్తిచేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.అయితే ఈ పూజ కార్యక్రమానికి చాలామంది ప్రముఖులతో పాటు డైరెక్టర్లు మోహన్ రాజా మెహర్ రమేష్ బాబీలు పాల్గొన్నారు. ఇక లూసిఫర్ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేస్తుండగా.. మరి మెహర్ రమేష్ బాబీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అయితే ఫోటోలో చూసినట్లుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకులందరితో మెగాస్టార్ సినిమాలు చేయనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే మరి మెగాస్టార్ అభిమానులు ఈ డైరెక్టర్స్ గురించి ఏం అనుకుంటున్నారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ మధ్య ఎక్కువగా ఫామ్ లో లేని డైరెక్టర్లను ఎంచుకున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారట. కానీ డైరెక్టర్లు బాబీ మెహర్ రమేష్ లతో మెగాస్టార్ సినిమా చేసే ఛాన్సులు మాత్రం ఉన్నట్లే అనిపిస్తుంది. అధికారికంగా బయటికి రానప్పటికి ఇండస్ట్రీలో మాత్రం ఈ డైరెక్టర్లతో మెగాస్టార్ సినిమాలు చేస్తే బాగుంటుందని టాక్.

అయితే తాజాగా తమిళ హిట్ ఫిల్మ్ వేదాలం టాపిక్ చర్చల్లోకి వచ్చింది. అజిత్ హీరోగా నటించిన వేదాలం సినిమాను మెగాస్టార్ తెలుగులో రీమేక్ చేయబోతున్నాడని ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. అయితే ఇంతవరకు ఆ విషయం పై క్లారిటీ లేకపోయింది. కానీ తాజాగా మెగాస్టార్ పక్కన డైరెక్టర్ మెహర్ రమేష్ ను చూస్తే పక్కా సంథింగ్ ఉందని అనిపిస్తుంది. అయితే వేదాలం సినిమా రీమేక్ గుట్టుచప్పుడు కాకుండా మెగాస్టార్ కన్ఫర్మ్ చేసాడు కాబట్టే మెహర్ రమేష్ ఈ కార్యక్రమానికి హాజరయ్యాడని సినీవర్గాలలో టాక్. చూడాలి మరి వేదాలం కన్ఫర్మ్ అయితే ఇక డిఫరెంట్ చిరును చూడవచ్చు..