ఇకపై మాస్ మెచ్చే చిత్రాలే… ప్రామిస్ చేసిన మెగాస్టార్

Mon Jan 23 2023 22:00:01 GMT+0530 (India Standard Time)

Megastar Promises on Mass Movies

మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ప్రయోగాత్మకంగా చేసిన సినిమాలు అన్ని కూడా విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్న అతనిని అభిమానించే ఫ్యాన్స్ మెప్పు పొందలేకపోయిన సంగతి తెలిసిందే.ర్ మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే హైవోల్టేజ్ ఎనర్జీ మాస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ పవర్ ఫుల్ ఎలివేషన్స్ మాస్ అంశాలు పుష్కలంగా ఉండే కథలు ఎక్కువగా గుర్తుకొస్తాయి. ఆయన కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన చిత్రాలు అన్ని కూడా అదే ఇదే ఫ్లేవర్ తో వచ్చినవే స్ట్రాంగ్ కంటెంట్ తో చేసిన పద్దతైన పాత్రలు ఉన్న సినిమాలు అన్ని కూడా ఎవరేజ్ లేదంటే డిజాస్టర్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా కూడా ఫ్యాన్స్ ఎవరికి కనెక్ట్ కాలేదు. దానికి కారణం ఆ క్యారెక్టర్ కి చిరంజీవి సెట్ కాలేదు అనే మాట వినిపించింది. సైరా నరసింహారెడ్డి లాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ ని చేసిన కూడా అది ఫుల్ సీరియస్ మోడ్ లో ఉండటం ఒక వర్గం ప్రేక్షకులకి మాత్రమే కనెక్ట్ అయ్యింది.

సినిమా హిట్ అయినా కూడా మెగా అభిమానులు మాత్రం ఆ మూవీతో సంతృప్తి చెందలేదు. ఇదిలా ఉంటే వాల్తేర్ వీరయ్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి పవర్ ప్యాక్డ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు.

 ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి జూమ్ కాల్ లో ఫ్యాన్స్ తో ముచ్చటించారు. మెగా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ అందరూ కూడా తన నుంచి ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నారో అర్ధమైందని అన్నారు. సైరా నరసింహారెడ్డి గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు ప్రేక్షకులు తన నుంచి కోరుకోవడం లేదని అన్నారు. అందుకే ఇకపై అలాంటి సినిమాలు చేయనని చెప్పుకొచ్చారు.

వాల్తేర్ వీరయ్య లాంటి ఫుల్ ఎనర్జీ అండ్ మాస్ ఎంటర్టైనర్ కథలని చూడటానికి ఇష్టపడుతున్నారని తెలిపారు. ఇకపై తన నుంచి అన్ని కమర్షియల్ సినిమాలు మాత్రమే వస్తాయని ప్రామిస్ చేశారు.

భోళా శంకర్ లో కూడా వాల్తేర్ వీరయ్యకి మించి మాస్ అంశాలు అండ్ ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటానని చెప్పారు. కథలలో మాస్ ఉండేలా డిజైన్ చేసుకుంటా అని తెలిపారు. వాల్తేర్ వీరయ్య సినిమాతో మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టూ పాస్ట్ వెళ్ళిపోవడానికి డిసైడ్ అయ్యారనే మాట ఇప్పుడు ఆ వీడియో కాల్ చూసిన వారు చెబుతున్నారు.        నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.