ఫొటోటాక్ : 40+ లోనూ అదే అందం

Thu Sep 23 2021 08:00:01 GMT+0530 (IST)

Megastar Heroine Enjoying At The Beach With Her Family

తెలుగు ప్రేక్షకులకు సమీరా రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు లో పలు సినిమాల్లో నటించిన ఈమె హిందీలో చాలా ఏళ్లు నటించింది. తెలుగు లో కొన్నాళ్లకే కనుమరుగు అయినా కూడా ఆమెను చాలా మంది ప్రత్యేకంగా అభిమానిస్తూ ఉంటారు. ఆమె తెలుగు సినిమాలు చేసి చాలా ఏళ్లు అయినా కూడా ఆమెను తెలుగు ప్రేక్షకులు గుర్తిస్తారు అనడంలో సందేహం లేదు. అలాంటి సమీరా రెడ్డి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అవ్వడంతో పాటు నాలుగు పదుల వయసును దాటి రెండేళ్లు కూడా అయ్యింది. అయినా కూడా అందం విషయంలో ఆమె ఇంకా పాతికేళ్ల అమ్మాయి ఉన్నట్లుగానే ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేసే విధంగా ఉంది అనడంలో సందేహం లేదు.తెలుగు మరియు ఇతర భాషల్లో చాలా సినిమాలు చేసిన సమీరా రెడ్డి సోషల్ మీడియాలో చాలా రెగ్యులర్ ఫొటోలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. పిల్లలు పుట్టిన సమయంలో కాస్త లావు అయిన సమీరా రెడ్డి ఆ సమయంలో సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ ను ఎదుర్కొంది. వాటికి ఆమె కూడా చాలా స్ట్రాంగ్ గానే రియాక్ట్ అయ్యింది. ఆడవారు తల్లి అయిన సమయంలో ఫిజికల్ గా మారుతారు. ఆ విషయం తెలియదా అంటూ అసహనం వ్యక్తం చేసింది. మీరు సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు అవతలి వారి హృదయాలను ఎంతగా వేదిస్తాయో మీకు అర్థం కాదా అంటూ కూడా చాలా సీరియస్ అయ్యింది. ట్రోల్స్ ను సీరియస్ గా తీసుకున్న సమీరా రెడ్డి ఆ తర్వాత చాలా కష్టపడి సన్నగా అయ్యింది.

ఇద్దరు పిల్లల సమయంలో కూడా లావు బాగా పెరిగిన సమీరా రెడ్డి ఇప్పుడు మాత్రం చాలా సన్నగా అయ్యింది. రెగ్యులర్ లుక్ లోకి వచ్చిన సమీరా తాజాగా తన పిల్లలు మరియు భర్తతో కలిసి బీచ్ కు వెళ్లింది. అక్కడ పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫొటోలను షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆ సమయంలో సమీరా డ్రస్ చాలా  పొట్టిగా ఉండటంతో పాటు క్లీవేజ్ షో తో రెచ్చ గొట్టింది. మొత్తానికి నాలుగు పదుల వయసు దాటినా కూడా ఈమె అదే అందంను మెయింటెన్ చేస్తున్నందుకు అభినందనలు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. సమీరా రెడ్డి రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నామని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆమెకు ఇంట్రెస్ట్ ఉందా అనేది చూడాలి.