అందుకే చిరు ఫుల్ కాన్ఫిడెన్స్ తో వున్నారా?

Sat Sep 24 2022 20:00:01 GMT+0530 (India Standard Time)

Megastar Confident on GodFather Film

మెగాస్టార్ చిరంజీవి నుంచి మెస్మరైంజింగ్ మూవీ కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. 'సైరా' తరువాత 'ఆచార్య'తో అయినా చిరు మెరుపులు మెరిపిస్తాడని ఆశిస్తే ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశే ఎదురైంది. దీంతో ఫ్యాన్స్ దృష్టి చిరు లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్' పై పడింది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రలో నటించాడు. నయనతార సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీని మోహన్ రాజా రూపొదించారు.మలయాళ హిట్ ఫిల్మ్ 'లూసీఫర్' దీనికి ఆధారం. అక్టోబర్ 5న భారీ స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ విషయంలో ఫ్యాన్స్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి ఫుల్ కాన్ఫిడెన్స్ తో వున్నారట.

కారణం కీలక ఘట్టాలు క్లైమాక్స్ ఫైట్.. చిరు సల్మాన్ లపై చిత్రీకరించిన మాస్ ఎలివేషన్స్ ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్ గా వుండనున్నాయని తెలుస్తోంది. సినిమాలో చిరుతో పాటు సల్మాన్ ఖాన్ పై ప్రత్యేకంగా చిత్రీకరించిన మాస్ ఫైట్స్.. ఎలివేషన్స్ ఓ రేంజ్ లో వుంటాయని వార్తలు వనిపిస్తున్నాయి.

ఇవి ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. ఆ కారణంగానే మెగాస్టార్ ఈ మూవీపై చాలా కాన్ఫిడెన్స్ తో వున్నారని ఇన్ సైడ్ టాక్. చిరు గత చిత్రాలకు పూర్తి భిన్నంగా 'గాడ్ ఫాదర్'ని తెరకెక్కించారు.

సినిమాలో చిరుకు హీరోయిన్ లేదు.. ప్రత్యేకంగా సాంగ్స్ వుండవు. అయితే ఇవన్నింటికి మించి చిరు క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ .. ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేసే విధంగా వుంటుందట. ఈ విషయాల్ని మెగాస్టార్ ఇటీవల రిలీజ్ చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోలో స్పష్టం చేశారు.  

అంతే కాకుండా సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతగా ఊమిస్తారో అంతకు మించి సినిమా వుంటుందని మరో సారి మెగాస్టార్ తాజా వీడియోలో ఫుల్ కాన్పిడెన్స్ తో చెప్పడం విశేషం. మరి ఫ్యాన్స్ ఆయన చెప్పినట్టే సంతృప్తిని వ్యక్తం చేస్తారా? లేదా అన్నది తెలియాలంటే అక్టోబర్ 5 వరకు వేచి చూడాల్సిందే. ఇటీవల విడుదలైన టీజర్ ఫస్ట్ లిరికల్ వీడియో విషయంలో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో వున్న విషయం తెలిసిందే.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.