Begin typing your search above and press return to search.

రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనన్న చిరు

By:  Tupaki Desk   |   1 Oct 2022 9:58 AM GMT
రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనన్న చిరు
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో నటించడంను ఒక అదృష్టంగా.. ఒక అద్భుత అవకాశంగా అంతా భావిస్తూ ఉంటారు. ఆయన రూపొందించే విజువల్ వండర్ లో సెట్‌ ప్రాపర్టీగా కనిపించేందుకు కూడా ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి అంటూ సినీ ఇండస్ట్రీకి చెందిన వారు అంటూ ఉంటారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన సినిమాల్లో ఒక్క ఫ్రేమ్‌ లో కనిపించినా చాలు అనుకునే వారు వందల సంఖ్యలో ఇండస్ట్రీలో ఉన్నారు.

ఎంతో మంది రాజమౌళి సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్న సమయంలో మెగాస్టార్‌ చిరంజీవి మాత్రం ఆయన దర్శకత్వంలో నటించాలని తాను భావించడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ మధ్య చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తాజాగా గాడ్‌ ఫాదర్ సినిమా ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్‌ వివరణ అడిగారు.

రాజమౌళి దర్శకత్వంలో చేయక పోవడంకు కారణం ఏంటీ అంటూ ప్రశ్నించగా.. చిరంజీవి స్పందిస్తూ... భారతీయ చలన చిత్ర పరిశ్రమ యొక్క ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పిన గొప్ప అద్భుతమైన దర్శకుడు ఆయన. ఆయన కథ అనుకున్నప్పటి నుండి సినిమాను పూర్తి చేయడానికి అయిదు సంవత్సరాల సమయం అయినా తీసుకుంటారు. ఆయన సినిమాలో చేయాలి అంటే ఆయనతో ట్రావెల్‌ చేయాల్సి ఉంటుంది.

ఆయనతో ట్రావెల్‌ చేసిన సమయంలోనే అద్భుతమైన ఔట్‌ పుట్‌ వస్తుంది. కాని నేనేమో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేయాలని కోరుకుంటూ ఉన్నాను. అందుకే మా ఇద్దరికి సెట్‌ అవ్వదు అన్నట్లుగా రాజమౌళిని ఆకాశానికి ఎత్తినట్లే మాట్లాడుతూ సినిమాల మేకింగ్‌ విషయంలో ఆలస్యం చేస్తాడు అంటూ సున్నితంగా విమర్శించినట్లుగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

చిరంజీవి గాడ్‌ ఫాదర్ సినిమా తో అక్టోబర్ 5న దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మరో వైపు రాజమౌళి ప్రస్తుతం మహేష్‌ బాబుతో సినిమాకు ఏర్పాట్లు చేస్తున్నాడు. వీరిద్దరి కాంబో లో ఇప్పుడు సినిమా వచ్చే పరిస్థితి లేదు. భవిష్యత్తులో అయిన జక్కన్న సినిమాలో చిరు పాత్ర ఏమైనా ఉంటుందేమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.