పచ్చ వెబ్ మీడియా మీద చిరు కామెంట్?

Mon Jan 23 2023 18:00:02 GMT+0530 (India Standard Time)

Megastar Chiranjeevi recently responded to the rating

మెగాస్టార్ చిరంజీవికున్న కామెడీ టైమింగ్ సెన్సాఫ్ హ్యూమర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీన్ లో కమెడియన్స్ లేకపోయినా సరే తనదైన పంథాలో కామెడీని పండించడంలోనూ ఆయన దిట్ట అనే విషయం చిరుని అభిమానించే వారందరికి తెలిసిందే. ఇక బయట కూడా ఆయన అదే తరహాలో చతుర్లు పంచ్ లు విసురుతూ తమదైన స్టైల్లో నవ్వులు పూయిస్తుంటారు. తాజాగా పచ్చ వెబ్ మీడియా మీద చిరు తనదైన పంథాలో పంచ్ లు వేశారు. తన నటించిన 'వాల్తేరు వీరయ్య'కు పలు వెబ్ సైట్స్ ఇచ్చిన రేటింగ్స్ పై చిరంజీవి జోకులు వేశారు.మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'వాల్తేరు వీరయ్య'. బాబి డైరెక్ట్ చేసిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ మూవీ వసూళ్ల పరంగా చిరు కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాస్ ని సాధించిన సినిమాగా రికార్డుని సొంతం చేసుకుంది. ఈ విషయాన్నితుపాకి డాట్ కామ్ ముందే ఊహించింది.

ఫస్ట్ డే ఫస్ట్ షోతో ఈ మూవీ తుపాకి డాట్ కామ్ చెప్పినట్టే వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. ఇదిలా వుంటే ఈ సినిమాకు పలు వెబ్ సైట్ లు 2.25 రేటింగ్ ఇవ్వడంపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సదరు రేటింగ్ లపై జోకులు వేశారు.

ఎవరినీ విమర్శించాలనే ఉద్దేశ్యంతో తాను ఈ జోకులు వేయలేదని కేవలం సరదాగానే చెబుతున్నానని తెలిపారు. 'వాల్తేరు వీరయ్య' యూఎస్ ప్రీమియర్స్ చూసి ఇక్కడ పలు వెబ్ సైట్లలో రివ్యూలు రాశారు. ఈ మూవీకి కొంత మంది 2.25 రేటింగ్ ఇచ్చారు.

అవి చూసి బాధపడకూడదని అనుకున్నాను. ఎందుకంటే ఈ సినిమాపై నాకు పూర్తి నమ్మకం వుంది. ఘరానా మొగుడు గ్యాంగ్ లీడర్ రౌడీ అల్లుడు అన్నయ్య వంటి సినిమాల తరువాత ఆ స్థాయిలో ఎంటర్ టైన్ మెంట్ వున్న సినిమా ఇది. కాబట్టి వాళ్లు ఇచ్చే రేటింగ్ ని పట్టించుకోవద్దనుకున్నా. కానీ ఆ తరువాతే తెలిసింది. 2.25 అంటే 2.25 మిలియన్ డాలర్లు అని. యుఎస్ లో అంత రెవెన్యూ వస్తుందని వాళ్లు ముందే చెప్పారని.. మేమే పొరపాటు పడ్డామని తెలిసింది' అంటూ చమత్కరించారు చిరు.    

ఇదిలా వుంటే 'వాల్తేరు వీరయ్య' ఇప్పటికే 2.2 మిలియన్ డాలర్లని క్రాస్ చేసి అక్కడ విజయ వంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిరు అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో నివశిస్తున్న పలువురు అభిమానులతో జూమ్ కాల్ లో మాట్లాడి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన సినిమాను ఆదరించిన వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.