Begin typing your search above and press return to search.

మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా

By:  Tupaki Desk   |   6 Feb 2023 4:30 PM GMT
మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా
X
మధుర ఫిలిమ్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్లపై జాతీయ అవార్డు గ్రహీత, విలక్షణ నటుడు బాబీ సింహా హీరోగా రమణన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'వసంత కోకిల'. ఇందులో బాబీ సింహా సరసన కాశ్మీర హీరోయిన్‌గా నటిస్తుంది.నాలభై ఏళ్ల క్రితం కమల్‌ హాసన్‌, శ్రీదేవి నటించిన సూపర్‌ హిట్‌ టైటిల్‌ 'వసంతకోకిల' తో ఈ సినిమా రూపొందుతుండటంతో ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌, సాంగ్స్ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను తెలుగులో రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడలో రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను అధికారికంగా విడుదల చేసారు. ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి రీలిజ్ చేసారు. కన్నడ ట్రైలర్‌ను స్టార్ హీరో శివరాజ్‌ కుమార్ లాంచ్‌ చేశారు.

ట్రైలర్ మొదటి నుండి చివరివరకు మంచి ఆసక్తికరంగా కట్ చేసారు. బాబీ సింహా-కశ్మీర పరదేశీ లవ్‌ ట్రాక్‌ తో పాటు వారి చుట్టూ జరిగి సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సినిమా సాగనున్నట్టు ట్రైలర్‌తో అర్ధమవుతుంది. మిస్టరీ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాబీ సింహా రుద్ర పాత్రలో కనిపించనున్నాడు. ప్రముఖ నటుడు ఆర్య కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు.ట్రైలర్ లో రాజేష్ మురుగేషన్ అద్భుతమైన బాక్గ్రౌండ్ స్కోర్ తో ఆసక్తిని పెంచాడు.

రమణన్‌ పురుషోత్తమ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రేష్మి సిన్హా, రజనీ తల్లూరి, రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు. ఈ వసంత కోకిల చిత్రం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

తారాగణం - సింహా, కాశ్మీర పరదేశి
రచన మరియు దర్శకత్వం - రమణన్ పురుషోత్తమ
నిర్మాతలు - రజనీ తాళ్లూరి & రేష్మి సింహా
సంగీత దర్శకుడు - రాజేష్ మురుగేశన్
DOP - గోపీ అమర్‌నాథ్
ఎడిటర్ - వివేక్ హర్షన్
కలరిస్ట్ - సేతు సెల్వం
సౌండ్ డిజైన్ - తపస్ నాయక్
ప్రొడక్షన్ డిజైన్ - నాగరాజ్ ఆర్కే
సాహిత్యం - చంద్రబోస్, రాకేందు మౌళి (తెలుగు)
సంభాషణలు - రాజేష్.ఎ.మూర్తి (తెలుగు)
యాక్షన్ డైరెక్టర్ - స్టన్నర్ సామ్ & స్టంట్ సిల్వా
కాస్ట్యూమ్ డిజైనర్ - నందిని ఎన్కే, రక్షా రవికుమార్
కొరియోగ్రఫీ - ఎం షెరీఫ్ & విజిసతీష్
పబ్లిసిటీ డిజైన్స్ - ట్యూనీ జాన్ - 24AM
స్టిల్స్ - శ్రీ బాలాజీ
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - ఆర్ పి బాల గోపి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - సతీష్ సుందర్‌రాజ్
లైన్ ప్రొడ్యూసర్స్ - J విద్యా సాగర్ & U Deleep కుమార్
ప్రొడక్షన్ కంట్రోలర్ - చెన్నూరి మహేందర్, ఆర్ జయ కుమార్
ప్రొడక్షన్ మేనేజర్ - విశ్వనాథన్
PRO - ఏలూరుశ్రీను & మేఘశ్యామ్ (తెలుగు)


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.