నువ్వు పుట్టుకతోనే స్టార్ వి.. ఉప్పెన బ్యూటీకి మెగా కితాబు!

Tue Feb 23 2021 08:58:54 GMT+0530 (IST)

Megastar Chiranjeevi Praises Kriti Shetty

ఓవర్ నైట్ స్టార్ డమ్ తో అందరి దృష్టిని ఆకర్షించింది కృతి శెట్టి. ఉప్పెన చిత్రంలో ఈ అమ్మడి నటనకు యువతరం ఫిదా అయిపోతున్నారు. అంతకుమించి మెగాస్టార్ చిరంజీవి కురిపించిన ప్రశంసలు ఈ అమ్మడికి బిగ్ బూస్ట్ అనే చెప్పాలి. ``నువ్వు పుట్టుకతోనే స్టార్ వి` అంటూ పొగిడేశారు చిరు. కృతి తనదైన అందం నటనతో ఉప్పెన ఆద్యంతం ఆకట్టుకుంది. అందుకే ఈ మెగా ప్రశంస.ఈ భామ ఇప్పటికే నాని సరసన శ్యామ్ సింఘరాయ్ తో పాటు సుధీర్ బాబు - ఇంద్రగంటి ప్రాజెక్టులోనూ నటిస్తోంది. ఇవేగాక మరిన్ని ఆఫర్లు వరించాయని తెలుస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆమెకు ఒక ఆశ్చర్యకరమైన బహుమతి ని పంపారు. దాంతో పాటే చిరస్మరణీయ ప్రశంసాపూర్వక లేఖను పంపారు. దీనిని కృతి తన ట్విట్టర్ పేజీలో ఉత్సాహంగా పంచుకుంది. ``మీరు బార్న్ స్టార్`` అంటూ చిరు కృతిని ప్రశంసించారు. మీరు ఒక స్టార్ మాత్రమే కాదు. అద్భుతమైన కళాకారిణి కూడా అని నిరూపించారు`` అని చిరు ఆ లేఖలో వ్యాఖ్యానించారు.

కృతిని వండర్ కిడ్ అని ప్రశంసించిన చిరు కేవలం .. ఒక వారంలోనే తెలుగు భాష ను అంత చక్కగా కృతి ఎలా నేర్చుకున్నారో చెబుతూ ప్రశంసించారు. ``తెలుగు ప్రేక్షకులు ఈ బెబమ్మపై తమ ప్రేమను ఆప్యాయతను ఎల్లప్పుడూ చూపిస్తారు`` అని అన్నారు.

ఉప్పెన రూ .50 కోట్ల (షేర్) క్లబ్ లో చేరుతున్న వేళ టీమ్ కి వ్యక్తిగతంగా శుభాకాంక్షలు చెబుతున్నారు. చిరంజీవి వ్యక్తిగత నోట్ రాయడమే గాక.. దాంతో పాటు సినిమాలోని అందరు తారాగణం.. టెక్నీషియన్లకు చిరు గిఫ్ట్ హాంపర్ లను పంపారు. దర్శకనిర్మాతలు సహా దేవీశ్రీ కూడా ఈ బహుమతి అందుకున్నారు.

ఇక మేనల్లుడి ఆరంగేట్ర చిత్రం కాబట్టి.. ఉప్పెన స్క్రిప్టును చిరంజీవి తొలి నుంచి నిశితంగా పరిశీలించారు. వైష్ణవ్ తేజ్ తన మొదటి చిత్రంతోనే ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యాడు. అతడికి కెరీర్ పరంగా కొన్నేళ్ల పాటే ఏ డోఖా ఉండదనే భావిస్తున్నారు. అయితే మెగా కాంపౌండ్ హీరో అయినా తనను తాను నిలబెట్టుకునేందుకు అతడు చాలా తెలివైన ఎత్తుగడల్ని అనుసరించాల్సి ఉంటుంది.