గాడ్ ఫాదర్.. ఆ టెన్షన్ పడకూడదని..

Mon Sep 26 2022 05:28:17 GMT+0530 (India Standard Time)

Megastar Chiranjeevi Godfather Movie

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. రీసెంట్ గా సెన్సార్ వర్క్ కూడా ఫినిష్ అయ్యింది. చిత్ర యూనిట్ కి అయితే సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నట్లు అర్థమవుతుంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమా సైలెంట్ గా వచ్చి బ్లాస్ట్ చేస్తుంది అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు.కానీ ఎవరు ఎన్ని చెప్పినా కూడా సినిమా విడుదల వరకు రిజల్ట్ ఏమిటి అనేది ఊహించడం కష్టమే. ఎందుకంటే ఆచార్య సినిమా సమయంలో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. కాబట్టి ఎవరి మాటలకు అంత నమ్మకం అయితే లేదు. ఇక సినిమా రిజల్ట్ అనేది విడుదల తర్వాతనే తెలుస్తుంది. అయితే గాడ్ ఫాదర్ సినిమా విషయంలో ఆచార్య తరహా టెన్షన్ రాకూడదని బలమైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

లూసిఫర్ సినిమా రీమేక్ అనే టాక్ తోనే ఈ సినిమాపై కొంత నెగిటివ్ ఇంప్రెషన్ అయితే ఉంది. సినిమా ఎంతో బాగుంటే గాని వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. ఇక కమర్షియల్ అంశాలు ఎక్కువైతే ఆచార్య తరహాలో నష్టాలు కూడా తప్పవు. అయితే మెగాస్టార్ ఈ సినిమాపై ఎలాంటి నమ్మకం పెట్టుకున్నారో తెలియదు కానీ ఎక్కడ కూడా సినిమా డిస్ట్రిబ్యూటర్లకు అమ్మకుండానే సొంతంగా విడుదల చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు.

తెలుగులోనే కాకుండా హిందీలో అలాగే మలయాళం కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నాడు విశేషం. అక్కడ కూడా సొంతంగానే విడుదల చేయాలి అని ఫిక్స్ అయ్యారు. ఒకవేళ సినిమా సక్సెస్ అయితే మాత్రం నిర్మాతకు భారీ స్థాయిలో ప్రాఫిట్ వస్తుంది. ఇక ఆ నష్టాలు వస్తే మాత్రం ఎవరితోను కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవట. ఆచార్య తరహాలో మళ్ళీ బయ్యర్లు వచ్చి ఒత్తిడి పెట్టే ఛాన్స్ కూడా ఉండదు అని చిరంజీవి ఈ తరహాలో నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి గాడ్ ఫాదర్ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.