గాడ్ ఫాదర్ : ఉన్నది ఉన్నట్లుగా దించినా అదిరింది

Sun Sep 25 2022 11:44:20 GMT+0530 (India Standard Time)

Megastar Chiranjeevi Godfather Movie

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా తో వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్న విషయం తెల్సిందే. మలయాళ బ్లాక్ బస్టర్ లూసీఫర్ కి రీమేక్ గా రూపొందిన గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మెల్ల మెల్లగా సాగుతున్నాయి. ప్రమోషన్ లో భాగంగా గాడ్ ఫాదర్ లోని కొన్ని స్టిల్స్ ని షేర్ చేయడం జరిగింది.అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి తెల్లటి కుర్తా మరియు దోతీ కట్టుకున్న ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చాలా కాలం తర్వాత చిరంజీవి తన వయసుకు తగ్గ పాత్రలో నటించడం.. కనిపించడం ఆనందంగా ఉందంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియాలో చిరంజీవికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మలయాళం సినిమా కనుక మోహన్ లాల్ దోతీ కట్టులో కనిపించాడు. తెలుగు వర్షన్ కి కూడా ఏమాత్రం మార్పు చేయకుండా గాడ్ ఫాదర్ సినిమా కు ఆ లుక్ ను కాపీ కొట్టేశారు. హీరో లుక్ మరియు కాస్ట్యూమ్స్ కూడా కాపీ కొట్టడం అప్పుడప్పుడు వికటిస్తుంది. అంటే అక్కడి డ్రెస్ లు ఇక్కడ సెట్ అవ్వక పోవడం జరుగుతుంది. కానీ మెగాస్టార్ చిరంజీవికి ఆ సమస్య లేదు.

లూసిఫర్ ని ఉన్నది ఉన్నట్లుగా కాపీ కొట్టినా కూడా చిరంజీవి తన క్రేజ్ మరియు స్టార్ డమ్ తో ఎలాంటి విమర్శలు లేకుండా చేసుకుంటున్నాడు. ముఖ్యంగా చిరంజీవి కుర్తా మరియు దోతీ కట్టు లో అందరిని ఆకట్టుకుంటున్నాడు. మోహన్ లాల్ ను అలా చూసి చిరంజీవిని చూసినా కూడా మా మెగాస్టార్ భలే ఉన్నాడే అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా ఓవరాల్ గా కూడా పెద్దగా మార్చకుండానే తెరకెక్కించారు. నేటివిటీ మిస్ కాకుండా చూస్తూ లూసీఫర్ ఉన్న ఎక్కడ సోల్ మిస్ కాకుండా జాగ్రత్తగా దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించినట్లుగా సమాచారం అందుతోంది. సినిమాలో నయనతార కీలక పాత్రలో కనిపించబోతుంది.

సల్మాన్ ఖాన్ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు. కమర్షియల్ హంగులు అద్దుకున్న ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా వారి యొక్క అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.