Begin typing your search above and press return to search.

#భోళా శంక‌ర్‌.. మ‌ణిశ‌ర్మ వార‌సుడికి మెగా బూస్ట్

By:  Tupaki Desk   |   15 Oct 2021 4:20 AM GMT
#భోళా శంక‌ర్‌.. మ‌ణిశ‌ర్మ వార‌సుడికి మెగా బూస్ట్
X
మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ వార‌సుడు మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ యువ సంగీత సంచ‌ల‌నంగా టాలీవుడ్ లో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. చార్ట్ బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్స్ తో ఇప్ప‌టికే యూత్ లో క్రేజు తెచ్చుకున్న మ‌హ‌తి ఇప్పుడు అగ్ర హీరోల సినిమాల‌కు ప‌ని చేస్తున్నారు.

తాజాగా మహతి స్వర సాగర్ కి మెగా ఆఫ‌ర్ ద‌క్కింది. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా మెహర్ రమేష్ తెర‌కెక్కించ‌నున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `భోళా శంకర్` కి సంగీతం అందించ‌నున్నారు. రామబ్రహ్మం సుంకర -అనీల్ సుంక‌ర ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇందులో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. రాఖీ పండ‌గ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన‌ ప్రత్యేక వీడియోలో చిరు- కీర్తి అన్నా చెల్లెళ్లుగా క‌నిపించారు. ఈ వీడియోకి అద్భుత‌ స్పందన వ‌చ్చింది. ఈ వీడియోలో చిరంజీవికి కీర్తి సురేష్ రాఖీ కడుతూ క‌నిపించింది. అది కొద్ది సమయంలోనే వైరల్ అయింది.

తాజా గా ఈ భారీ చిత్రానికి యువ స్వరకర్త మహతి స్వర సాగర్ సంగీతం అందించ‌నున్నార‌ని టీమ్ ప్ర‌క‌టించింది. మ‌హ‌తి సాగర్ పై ద‌ర్శ‌కుడు మెహర్ రమేష్ ఎంతో న‌మ్మ‌కంతో ఎంపిక చేసుకున్నార‌ని తెలిసింది. మెహర్ -మణి శర్మ కాంబో ఇంతకుముందు చార్ట్ బస్టర్ పాట‌ల్ని అందించారు. ఇక‌ మణి శర్మ- మెగాస్టార్ దశాబ్దాలుగా విజయవంతమైన కాంబినేష‌న్ అన్న సంగ‌తి తెలిసిందే.. ఇప్పుడు మ‌ణి స‌ర్ కుమారుడు మహతి స్వర సాగర్ వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ మెగా ఫ్యామిలీకి సంగీతం అందించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. భోళా శంకర్ సంగీతానికి మాస్ బీట్స్ కి ఆస్కారం ఉన్న సినిమా. స్థానిక - అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు సహకారంతో ఉన్నత ప్రమాణాలతో పాటలు BGM ని రూపొందించ‌నున్నారు. ఈ సినిమాతో సాగర్ సంచలన స్వరకర్తగా మారబోతున్నారు. మ‌హ‌తి బ‌ర్త్ డే సంద‌ర్భంగా నేడు బ‌ర్త్ డే బోయ్ కి శుభాకాంక్ష‌లు చెబుతూ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు.

మెగాస్టార్ యువ ప్రతిభావంతులను అన్నివేళ‌లా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ కోసం సంగీతం అందించే అవకాశాన్ని మహతి స్వర సాగర్ పొందడం ఒక డ్రీమ్ లాంటిది. అనిల్ సుంకర ఎకె ఎంటర్ టైన్ మెంట్స్- క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. భోలా శంకర్ నవంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుండగా.. 2022 లో థియేటర్లలో విడుదల కానుంది. రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.