స్టైలిష్ అట్రాక్టీవ్ లుక్కులో మెగాహీరో..!

Thu Apr 22 2021 09:00:02 GMT+0530 (IST)

Megahero in stylish attractive look

ఇండస్ట్రీలో మెగాఫ్యామిలీ అంటే సినీ అభిమానులకు ఓ ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకే మెగాఫ్యామిలీ నుండి ఎంతమంది హీరోలు ఇండస్ట్రీలో అడుగుపెట్టినా ఫ్యాన్స్ ఇట్టే ఓన్ చేసుకొని ఆదరిస్తుంటారు. మెగాఅల్లుడు సాయిధరమ్ తేజ్ తర్వాత ఈ ఏడాది తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఉప్పెన అనే రొమాంటిక్ ప్రేమకథా చిత్రంతో వైష్ణవ్ డెబ్యూ చేసాడు. మొదటి ప్రయత్నంలోనే వైష్ణవ్ సూపర్ సక్సెస్ అందుకొని యువతకు బాగా దగ్గరయ్యాడు. ఉప్పెన ఊపులోనే వరుసగా సినిమాలను లైన్ లో పెట్టేసాడు. ప్రస్తుతం వైష్ణవ్ చేతిలో నాలుగు సినిమాల వరకు ఉన్నాయట.అయితే సినిమాలు షూటింగ్స్ మాత్రమే కాకుండా ఈ మెగాహీరో సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టీవ్ గా ఉంటాడు. అందుకే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. తాజాగా వైష్ణవ్ న్యూ ఫోటోషూట్స్ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైట్ అండ్ బ్లూ మిక్సడ్ కలర్ సూట్ లో వైష్ణవ్ న్యూ లుక్ చాలా అట్రాక్టీవ్ గా ఉందని చెప్పాలి. ఉప్పెన సినిమాతో ఫేమ్ మాత్రమే కాదు ఈ మెగాహీరోకు ఇంస్టాగ్రామ్ లో అమ్మాయిల ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగింది. మరి తాజా సూట్ లో వైష్ణవ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అదే కోరమీసంతో వింటేజ్ మెగాస్టార్ ను తలపిస్తున్నాడని మెగాఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వైష్ణవ్ నటించిన 'జంగల్ బుక్' మూవీ విడుదలకు సిద్ధంగా ఉందని టాక్.