Begin typing your search above and press return to search.

మెగా కొండను ఢీ కొట్టి మరీ... ?

By:  Tupaki Desk   |   17 Oct 2021 4:34 AM GMT
మెగా కొండను ఢీ కొట్టి మరీ... ?
X
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీదే పెద్ద పీట. ఎవరు అవునన్న కాదన్నా కూడా వారిదే పై చేయి. తెలుగు సినిమా వందకు పైగా సినిమాలను ఏడాదికి రిలీజ్ చేస్తే అందులో మెజారిటీ వాటా మెగా ఫ్యామిలీదే ఉంటుంది. పది మందికి పైగా హీరోలు అక్కడ ఉన్నారు. వారంతా కనీసం ఒకటి రెండు సినిమాలు చేసినా కూడా ఏడాదికి పాతిక ముప్పయి సినిమాలు అవుతాయి. ఆ విధంగా చూసుకుంటే మొత్తం సినిమాల్లో పాతిక శాతం వాటా ఆ కుటుంబానిదే. అందువల్ల మెగా హీరోల సినిమాల వచ్చే టర్నోవర్ ఎక్కువే అని చెప్పాలి. ఇక బ్లాక్ బస్టర్లు, సూపర్ డూపర్ హిట్లు కూడా ఆ ఫ్యామిలీ నుంచే ఎక్కువగా వస్తాయి. దాంతో వందల కోట్ల రూపాయల బిజినెస్ మెగా ఫ్యామిలీ నుంచే వస్తుంది.

ఇలా లెక్కలు అన్నీ చూసుకున్నా ఏ విధంగా మాట్లాడుకున్నా కూడా మెగా ఫ్యామిలీని టాలీవుడ్ విస్మరించలేదు. మరో వైపు చూసుకుంటే ఇప్పటిదాకా వారికి ఎదురునిలిచిన వారూ లేరు. ఈ నేపధ్యంలో మెగా ఫ్యామిలీ అనే కొండను మంచు ఫ్యామిలీ ఢీ కొట్టిందా అన్న ప్రశ్నలు అయితే అందరిలో వస్తున్నాయి. మా అంటే అందరి సంస్థ. అందులో ఉన్న సభ్యులకు న్యాయం చేయాలి. మరి మాకు సొంతంగా ఆస్తులు లేవు. ఏ పని చేయాలన్నా ఫండ్ రైజ్ చేయాలి. ఇతర భాషా హీరోల సహకారం తీసుకోవడం వరకూ ఓకే కానీ ముందుగా ఉన్న సొంత ఇంటి వారి హెల్ప్ కూడా తీసుకోవాలి కదా.

అలా అందరూ కలసి మెలసి ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది. మరో వైపు చూస్తే టాలీవుడ్ లో ఆధిపత్య పోరు చాలాకాలంగానే సాగుతోంది. అయితే అది ఇన్నాళ్ళూ మబ్బుల చాటునే ఉంది. ఇపుడు మా ఎన్నికల ఫలితంగా బయటకు వచ్చింది. మా ప్రెసిడెంట్ గా విష్ణు గెలిచినా ఆయన తన రెండేళ్ల పాలన సవ్యంగా చేయాలంటే మెగా ఫ్యామిలీ సహకారం అవసరం అన్న మాట ఉంది. అందరూ కలిస్తేనే తప్ప టాలీవుడ్ ని ముందుకు తీసుకుపోలేరు. అలాగే మా యాక్టివిటీని కూడా నడిపించలేరు. ఇవన్నీ చూసుకున్నపుడు మెగా ఫ్యామిలీ వంటి కొండను ఢీ కొట్టామనుకోవడం తాత్కాలిక ఆనందమే అంటున్నారు.

మెగా ఫ్యామిలీ పట్ల టాలీవుడ్ లో ఉన్న మిగిలిన పెద్ద కుటుంబాలు కూడా సఖ్యతగా ఉంటున్నాయి. అలాగే చాలా మంది నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ కూడా వారితో మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తూ ఉంటాయి. ఈ నేపధ్యంలో యువకుడు, ఉత్సాహవంతుడు అయిన విష్ణు వంటి వారు అందరినీ ఒక త్రాటిపైన తీసుకువచ్చి నడిపించాల్సి ఉంటుంది. కేవలం రెండేళ్ల కాలం అంటే ఇట్టే తిరిగేస్తుంది. ఇక ఈ ఎన్నికలతోనే వైరి పక్షం పని అయిపోయిందనో మరోటో అనుకుని భ్రమపడితే అది మా అసోసియేషన్ కి చేటు తేవడమే కాకుండా ఎన్నో ఆశలతో గెలిపించిన కొత్త కార్యవర్గానికి కూడా ఇబ్బందికే కలిగిస్తుంది అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మెగా హవాను ఎవరూ అడ్డుకోలేరని కూడా అంటున్నారు. మా ఎన్నికలతో సంబంధం లేకుండా మెగా హీరోలు టాలీవుడ్ లో ప్రేక్షకుల అభిమానం ఉన్నంతవరకూ సక్సెస్ సాధిస్తూనే ఉంటారని కూడా మెగా ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే మా రెండుగా చీలిపోకుండా నిండుగా కలసి ఉంటేనే మాకు క్షేమమని, విజయం సాధిచిన వారికీ అదే ధన్యతను ఇస్తుందని విలువైన సూచనలు మాత్రం అందుతున్నాయి.