వరుణ్ కోసం మెగాబ్రదర్ సెలక్షన్.. రెడీ అవుతున్నాయా..?

Mon Mar 01 2021 22:00:02 GMT+0530 (IST)

Megabrother selection for Varun .. Are you ready ..?

మెగాహీరో వరుణ్ తేజ్.. ఈమధ్య కెరీర్ పరంగా చాలా జాగ్రత్తపడుతున్నాడు. ఆచితూచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అయితే ఇప్పటికే మెగాబ్రదర్ నాగబాబు.. వరుణ్ పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. 'మా వరుణ్ ఎలాంటి పెళ్లి చేసుకున్నా పర్లేదు. అంటే ప్రేమపెళ్లి లేదా అరెంజ్ మ్యారేజ్ ఏదైనా ఓకే. కానీ అమ్మాయి వరుణ్ కి అన్నివిధాలా సరిజోడినా కాదా అనేది చూస్తాం' అంటూ కొడుకు పెళ్లి గురించి ఇదివరకే మనసులో మాట బయటపెట్టేసాడు నాగబాబు. ప్రస్తుతం తన కెరీర్ విజయవంతంగా రన్ చేస్తున్నాడు వరుణ్. ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో గని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక మరోవైపు ఎఫ్3 కూడా కంప్లీట్ చేస్తున్నాడు. డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంటున్నాడు మెగాహీరో. అయితే మెగాస్టార్ చేసిన సినిమాలను వరుణ్ తో చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు మెగాబ్రదర్ నాగబాబు గతంలోనే చెప్పేసాడు. ఇప్పుడు అవే సినిమాలను లైన్ చేస్తున్నట్లు సమాచారం.అయితే మెగాస్టార్ చేసిన సినిమాల్లో ఏ సినిమాను వరుణ్ తో రీమేక్ చేస్తారు?' అని అడిగిన ప్రశ్నకు.. నాగబాబు స్పందించి 'అన్నయ్య చేసిన సినిమాల్లో నాకు 'ఛాలెంజ్' అంటే చాలా ఇష్టం. సత్యానంద్ గారు మంచి స్క్రీన్ ప్లేను అందించారు. వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ కి ఈ సినిమా అయితే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. అలాగే 'కొదమసింహం' కూడా నాకు బాగా నచ్చుతుంది. హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో ఆ సినిమాను రూపొందించారు. కౌబాయ్ గా అన్నయ్య యాక్టింగ్ ఇరగదీసారు. ఈ సినిమా కూడా వరుణ్ తేజ్ కు సెట్ అవుతుందని అన్పిస్తుంది. కానీ అన్నయ్య చేసిన సినిమాలను రీమేక్ చేసి మెప్పించడం వరుణ్ కు సవాలే అవుతుంది" అంటూ మెగాస్టార్ సినిమాలను మెల్లగా స్క్రిప్ట్ వైపు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్. అలాగే పర్సనల్ గా వరుణ్ మైండ్ లో పవర్ స్టార్ జానీ సినిమా చేయాలనే ఆశతో ఉన్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ముందుగా ఏ సినిమా రీమేక్ పట్టాలెక్కుతుందో!