భారీ పెట్టుబడితో మెగా హీరోలు మెగా బస్తీ బిజినెస్?

Mon Aug 03 2020 17:01:02 GMT+0530 (IST)

Mega heroes are ready for business with a big investment

మెగా హీరోలకు బిజినెస్ వ్యాపకాలు కొత్తేమీ కాదు కానీ.. ఈసారి మెగా యువ హీరోలంతా కలిసి ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నారన్నదే టాలీవుడ్ ఇన్ సైడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మెగా యంగ్ హీరోలంతా కలిసి పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి ఓ తరహా బస్తీ బిజినెస్ కోసం ప్లాన్ చేస్తున్నారట.ఆ బిజినెస్ లో అందరికీ సమానంగా షేర్ ఉండేట్టు మంచి బిజినెస్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఆ బిజినెస్ ఏమిటి? ఎంత పెట్టుబడి పెడుతున్నారు? అనేవి త్వరలోనే తెలుస్తుందట. కోవిడ్ 19 విజృంభిస్తున్న ఇలాంటి సమయంలో ఏ తరహా బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు? అన్నది సస్పెన్స్ గా మారింది. చరణ్ .. బన్ని లాంటి పెద్ద స్టార్లు నిర్మాతలుగానే కొనసాగుతున్నారు. అల్లు శిరీష్ ఆహాకు సపోర్టుగా నిలుస్తున్నారు. ఇతర మెగా యువహీరోల మాటేమిటి అన్నదే సస్పెన్స్.

సినిమా థియేటర్లు మూతపడి ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది. ఇవి ఎప్పటికి తెరుస్తారు? అన్నది సందిగ్ధంలో పడింది. ఇలాంటప్పుడు ఓటీటీ-డిజిటల్ మాంచి ఊపు మీదుంది. అందుకే ఓటీటీ-ఏటీటీ అంటూ ఆర్జీవీ సహా యూత్ డిజిటల్ కంటెంట్ పై పడుతున్నారు. ఇప్పటికే అల్లు అరవింద్ ఆహా తెలుగు ఓటీటీని సక్సెస్ చేసేందుకు తపిస్తున్నారు. మరి మెగా యువ హీరోలు ఈ తరహా ఆలోచన ఏదైనా చేశారా? అందరికీ ఉపాధి ప్రాతిపదికన ఓటీటీ ఏటీటీలు ప్లాన్ చేస్తున్నారా?  లేదూ.. అందుకు భిన్నంగా ఏదైనా చేస్తున్నారా?  మహమ్మారీ సమయంలో ఇంకేవైనా సైడ్ బిజినెస్ ప్లాన్ చేస్తున్నారా? అన్నదానిపై లీకులేవీ లేవు.

ఇప్పుడంతా హాస్పిటల్స్ మెడికల్ ఫీల్డ్ హవా సాగిస్తోంది. శానిటేషన్ ఉత్పత్తుల బిజినెస్ వర్కవుటవుతోంది. ఆన్ లైన్ గ్రాసరీ-డీమార్ట్ చైన్ తరహా బిజినెస్ ల హవా సాగుతోంది యథావిథిగా. బంగారం ధర అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇదో రిచ్ బిజినెస్ ప్లాన్. చాలా వ్యాపారాలు గాల్లో కలిసిపోయినా కొన్ని మాత్రం వెలుగుతున్నాయి. మరి అవేంటో కనిపెట్టి సరైన టైమ్ లో ఇలా పెద్ద ఎత్తున పెట్టుబడులతో బరిలో దిగుతున్నారా? అన్నది చూడాలి.