సంక్రాంతి సంబరాల్లో ఆ రెండు ఫ్యామిలీ ఫోటోలు అదిరాయి

Fri Jan 17 2020 10:45:04 GMT+0530 (IST)

Mega family and Manchu Family Sankranti Celebrations

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ సంక్రాంతి అంటే ఎంత ఉత్సాహమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరికి వారు.. వారి స్థాయిల్లో పండుగ చేసుకుంటారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత తాము చేసే పనులకు సంబంధించిన ఫోటోల్ని తమను అభిమానించే వారికి అందుబాటులో ఉండేలా పెట్టుకోవటం ఒక అలవాటుగా మారింది. ఈ సంక్రాంతి సందర్భంగా పలువురు తారలు.. సెలబ్రిటీలు తమ సంక్రాంతి సంబరాలకు సంబంధించిన ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.ఆ ఫోటోల్లో రెండు ఫోటోలు అభిమానుల్ని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అందులో ఒకటి మెగా ఫ్యామిలీ అంతా కలిసి చిరుతో దిగిన ఫోటో అయితే.. మరొకటి విష్ణు వెరోనికా దంపతులు తమ నలుగురు పిల్లలతో కలిసి దిగిన ఫోటో. పలువురు ప్రముఖులు తమ సంక్రాంతి సంబరాల్ని చాటి చెప్పేలా ఫోటోల్ని పోస్టు చేసినప్పటికీ.. ఈ రెండు ఫోటోలు మాత్రం అందరిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

మెగాస్టార్ తో మెగా హీరోలతో పాటు.. మెగా ఫ్యామిలీకి చెందిన పవన్ కల్యాణ్.. ఆయన కొడుకు మినహా మిగిలిన వారంతా ఈ ఫోటోలో ఉన్నారని చెప్పాలి. ఇక.. విష్ణు వెరోనికా ఫ్యామిలీ ఫోటోలో వారిద్దరే కాదు.. వారి పిల్లలు రెఢీ అయిన తీరు చూస్తే.. సంక్రాంతి సంబరమంతా వారింట్లోనే ఉన్న భావన కలగటం ఖాయం. ఆ రెండు ఫోటోల్ని మీరు కూడా చూసేయండి.