వేరుకాపురం పెట్టిన రామ్ చరణ్...కారణం అదేనా...?

Fri Mar 27 2020 10:40:05 GMT+0530 (IST)

Mega Power Star Ram Charan New House

ఒకప్పుడు భారతదేశం అంటేనే ఉమ్మడి కుటుంబాలకు నెలవు. పూర్వ కాలంలో అనేక తరాలకు చెందిన వ్యక్తులు ఒకే కుటుంబంలో కలిసి జీవించేవారు. అయితే కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల ఉమ్మడి కుటుంబాలు విచ్చన్నమై చిన్న కుటుంబం అనే భావన ఏర్పడింది. ఇప్పటి తరంలో ఉమ్మడి కుటుంబాలు మచ్చుకైనా కనిపించడం లేదు. ఇంక మన టాలీవుడ్ విషయానికొస్తే తెలుగు ఇండస్ట్రీలో ఉమ్మడి కుటుంబాలు కాస్త తక్కువనే చెప్పాలి. కానీ కొన్ని పెద్ద కుటుంబాలు ఇప్పటికి కలిసే ఉంటున్నాయి. వారిలో మెగా ఫ్యామిలీ గురించి చెప్పుకోవచ్చు. కొణెదల ఫ్యామిలీ విషయానికొస్తే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కుటుంబమంతా కలిసే ఉంటుంది. సమయం దొరికినప్పుడల్లా ఎవరెక్కడ ఉన్నా కూడా అందరూ చిరంజీవి ఇంట్లో వాలిపోతారు. తమ్ముళ్లు నాగబాబు పవన్ కళ్యాణ్ కూడా వీలున్న ప్రతిసారి అన్నయ్య ఇంటికి వచ్చి వెళ్తుంటాడు. ఉపాసనతో పెళ్లి అయిన తర్వాత కూడా రామ్ చరణ్ తల్లిదండ్రులతోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈయన కూడా వేరే ఇంటికి మారిపోయినట్లు సమాచారం. భార్యతో కలిసి పెద్ద ఇల్లు తీసుకుని విడిగా ఉంటున్నాడని ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం చిరంజీవి ఉన్న ఇంటిని తన టేస్ట్ కి తగ్గట్లుగా రామ్ చరణ్ మార్పులు చేయించుకున్నాడు. కానీ ఇప్పుడు ఎందుకో తెలియదు మరి ఆ ఇంట్లో ఉండటం లేదంట. దానికి సమీపంలోనే రామ్ చరణ్ ఉపాసన దంపతులు మరో ఇల్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉపాసన - చరణ్ ఇప్పుడు ఆ ఇంట్లోనే వేరుగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ న్యూస్ అప్పట్లో బయటకి వచ్చినా దీనికి ఇన్ని రోజులు సరైన సాక్ష్యాలు లేవు. కానీ మొన్న జనతా కర్ఫ్యూ సందర్భంగా సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి బయటికి వచ్చి చప్పట్లు కొట్టే సమయంలో చిరంజీవి ఫ్యామిలీ మొత్తం ఇంటి బయటకి వచ్చి క్లాప్స్ కొట్టారు. అందులో ఆయన తల్లితో పాటు చెల్లెల్లు బావలు పిల్లలు.. మెగా ఫ్యామిలీ సభ్యులు అందరూ ఉన్నారు.. కానీ రామ్ చరణ్ దంపతులు మాత్రం లేరు. వాళ్లిద్దరూ లేరన్న విషయంలో ప్రతి ఒక్కరికీ డౌట్ వచ్చింది.

అంతే కాకుండా అదే సమయంలో రామ్ చరణ్ ఉపాసన వేరే ఇంటి బయటికి వచ్చి బాల్కనీ నుంచి చప్పట్లు కొట్టారు. ఆ సమయంలో అక్కడ వాళ్ళు ఇద్దరు తప్ప ఎవరూ లేరు. దాంతో చిరంజీవి రామ్ చరణ్ ఇప్పుడు వేరు వేరు ఇళ్ళల్లో ఉన్నారనే విషయం స్పష్టమైపోయింది. నిజానికి టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ నుండి నాగచైతన్య మంచు ఫ్యామిలీ నుండి మనోజ్ మంచు విష్ణు అల్లు ఫ్యామిలీ నుండి అల్లు అర్జున్ లాంటి వాళ్లు కూడా తమ తల్లిదండ్రులతో కాకుండా వేరుగా ఉంటున్నారు. ఇప్పుడు చరణ్ కూడా ఇదే చేశాడు. అయితే దూరంగా ఉన్నారనే మాటే కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తండ్రి ఇంటికి భార్యతో సహా వెళ్లి వస్తుంటాడంట రామ్ చరణ్. కేవలం ప్రైవసీ కోసం మాత్రమే మరో ఇల్లు తీసుకున్నారని మెగా ఫ్యామిలీలో గొడవలేమీ లేవని సమాచారం.