మెగా హీరో కెరీర్ సెట్టయినట్టేగా?

Wed Jun 29 2022 23:00:02 GMT+0530 (IST)

Mega Hero Young Panja Vaishna Tej career set?

టాలీవుడ్ లో వారసుల తాకిడి ఎక్కువే.. ఇప్పటికే వివిధ ఫ్యామిలీస్ కు చెందిన వారసులు హీరోలుగా టాలీవుడ్ లో రాణిస్తున్నారు. కొత్తగా ఎంట్రీ ఇచ్చినవారు కొంత మంది స్ట్రగుల్ అవుతున్నారు.. మరి కొంత మంది సైలెంట్ గా కెరీర్ ని సెట్ చేసుకుంటూ దూసుకుపోతున్నాను. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్నీ ఇచ్చిన యంగ్ హీరో పంజా వైష్ణవేజ్ ఇదే తరహాలో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు డజను మంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసి తమ తమ స్థానాలని పదిలం చేసుకుంటూ వున్నారు.ఈ కాపౌండ్ నుంచి వచ్చే హీరోలకు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటం విశేషం. ఇక ఒకే ఫ్యామిలీకి చెందిన ఎక్కువ మంది హీరోలు స్టార్ లుగా ఓ వెలుగు వెలుగుతుండటం కూడా మెగా ఫ్యామిలీకే చెల్లింది.

ఇప్పడు ఇదే ఫ్యామిలీ నుంచి మరో యంగ్ హీరో స్టార్ గా తనదైన మార్కు నటనతో విభిన్నమైన సినిమాలతో తనని తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతనే పంజా వైష్ణవ్ తేజ్. తొలి చిత్రం 'ఉప్పెన'తో ఏకంగా వంద కోట్ల క్లబ్ హీరోగా పేరు తెచ్చుకుని రికార్డుని సొంతం చేసుకున్నాడు.

ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ అల్లు అర్జున్ వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ వంటి హీరోలు స్టార్ గా తమదైన ముద్ర వేశారు. ఫ్యాన్స్ కి హాట్ ఫేవరేట్ గా నిలుస్తున్నారు. ఈ జాబితాలోకి అతి తక్కువ సమయంలోనే వైష్ణవ్ తేజ్ చేరిపోయినట్టుగా తెలుస్తోంది. క్రిష్ డైరెక్షన్ లో చేసిన 'కొండ పొలం' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అయితే మూడవ మూవీ 'రంగ రంగ వైభవంగ'తో ఆ లోటుని భర్తి చేయబోతున్నాడట.

ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. పవన్ కల్యాణ్ కెరీర్ లో అత్యంత భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం 'ఖుషీ'. ఇద్దరు ప్రేమికులు ఈగో నేపథ్యంలో సాగిన ఈ మూవీ రికార్డులు సృష్టించి ఇప్పటికీ పవర్ సినిమాల్లో ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సరిగ్గా ఇదే ఫార్ములాని 'రంగ రంగ వైభవంగ' మూవీకి ఫాలో అయినట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేసింది.

ఈ టీజర్ చూసిన కొంత మంది మేకర్స్ వైష్ణవ్ తేజ్ టాలెంట్ ని గమనించి అతనితో సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రముఖ కంపనీలు అడ్వాన్స్ లు కూడా ఇచ్చేశాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఫార్చూర్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఓ భారీ యాక్షన్ మూవీని వైష్ణవ్ తేజ్ తో ప్రారంభించేశాయి కూడా. మరి కొన్ని సినిమాలు పైప్ లైన్ లో వున్నాయి. వైష్ణవ్ తేజ్ స్పీడు చూస్తున్న వాళ్లంతా మెగా ఫ్యామిలీ నుంచి మరో యంగ్ హీరో కెరీర్ సెట్టయినట్టే అని కామెంట్ లు చేస్తున్నారు.