ఫొటోటాక్ : మెగా హీరో ఓ స్ట్రాంగ్ రీ ఎంట్రీ

Sun Jan 16 2022 14:00:01 GMT+0530 (IST)

Mega Hero Strong Re entry

ఒక వ్యక్తి యాక్సిడెంట్ నుండి బయట పడటం అంటే ఖచ్చితంగా మళ్లీ పుట్టినట్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రాణాపాయ స్థితి నుండి బయట పడ్డ వ్యక్తి కొత్త జీవితంను చాలా స్ట్రాంగ్ గా మొదలు పెట్టాల్సి ఉంటుంది. అప్పడే అంతా కూడా అతడి యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకే సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత తన కెరీర్ ను ఇంతకు ముందు కంటే మరింత స్ట్రాంగ్ గా మల్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. దాదాపు మూడు నాలుగు నెలల పాటు బెడ్ కే పరిమితం అయ్యి పూర్తి విశ్రాంతి మూడ్ లో ఉన్నా కూడా సాయి ధరమ్ తేజ్ బరువు పెరగకుండా మునుపటి లుక్ లోనే ఉన్నాడు.సాయి ధరమ్ తేజ్ లుక్ మరియు ఆయన స్టైల్ విషయంలో ఏమాత్రం మార్పు రాలేదు అని నిరూపించేలా తాజా ఫొటోలు ఉన్నాయి. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా ఈ ఫొటోను షేర్ చేసి... తిరోగమనం కంటే పునరాగమనం ఎల్లప్పుడూ బలంగా ఉంటుంది అనే కొటేషన్ ను జత చేశాడు. అతడు రీ ఎంట్రీని ఎంత స్ట్రాంగ్ గా కోరుకుంటున్నాడో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. జీవితాన్ని జయించినట్లుగా అతడు చావును జయించాడు. అత్యంత ప్రమాదకర స్థాయి నుండి అతడు పూర్తిగా కోలుకుని సాదారణ స్థితికి వచ్చాడు. కనుక ఇప్పుడు అతడు మంచి రీ ఎంట్రీ ఇస్తే మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ను ఆకాశానికి ఎత్తుతారు.

హీరో సాయి ధరమ్ తేజ్ గత చిత్రం రిపబ్లిక్ తో మంచి పేరును దక్కించుకున్నాడు. కమర్షియల్ గా ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కాని నటుడిగా మంచి మార్కలు తెచ్చి పెట్టింది అనడంలో సందేహం లేదు. రిపబ్లిక్ విడుదల సమయంలోనే ఈయనకు యాక్సిడెంట్ అయ్యింది. అప్పటి నుండి మళ్లీ షూటింగ్ లో తేజ్ జాయిన్ అవ్వలేదు. ఎట్టకేలకు మళ్లీ ఈయన షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నట్లుగా తాజా ట్వీట్ తో తేలిపోయింది. కార్తీక్ వర్మ దన్ను దర్శకత్వంలో ఈయన సినిమా రూపొందుతుంది. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి అయ్యింది. సినిమా ను సమ్మర్ లో విడుదల చేసేలా షూటింగ్ ను ముగించే ప్రయత్నాలు చేస్తున్నారట. సమ్మర్ కాకుంటే ఈ ఏడాది చివరి వరకు  అయినా సాయి ధరమ్ తేజ్ 15వ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.