పెళ్లి పీటలెక్కుతోన్న కొణిదెల వారసుడు

Fri Aug 12 2022 17:03:57 GMT+0530 (IST)

Mega Hero Engaged To Heroine

టాలీవుడ్ లో మెగా బ్రాండ్ ఇమేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి వారసత్వంతో రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వగా...అటుపై వరుణ్ తేజ్.. అదే  బ్రాండ్ తో బన్నీ... శిరిష్ .. సాయిధరమ్...వైష్ణవ్ తేజ్..కళ్యాణ్ దేవ్ లు ఇండస్ర్టలీకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వారంతా ఎవరికి వారు సినిమాలు చేసుకుంటున్నారు.వీళ్లంతా మెగాస్టార్ కి బాగా దగ్గర బంధువులు కాబట్టి వెలుగులోకి వచ్చారు . పరిశ్రమలో వేగంగా పాతుకు పోయారు. కానీ అదే మెగా  బ్రాండింగ్ తో మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన పవన్ తేజ్ కొణిదెల మాత్రం ఇంకా ఎదిగే ప్రాసస్ లోనే ఉన్నాడు. 'ఈ కథలో పాత్రలు' కల్పితం  అనే సినిమాతో పవన్ ఎంట్రీ ఇచ్చాడు.  ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేసింది లేదు.

అయితే ఇప్పుడీ యంగ్ హీరో పెళ్లి పీటలెక్కబోతున్నాడు.  తన సహ నటి..ఈ కథలో పాత్రలు హీరోయిన్..యాంకర్ మేఘనను పెళ్లాడుతున్నాడు. ఇద్దరు తొలి సినిమాతోనే ప్రేమలో పడ్డారుట. ఇప్పుడా ప్రేమ పెళ్లి పీటలెక్కుతుంది. బుధవారమే ఇరు కుటుంబాల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.

ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ.. యాంకర్ సుమ.. రాజీవ్ కనకాల.. సాయి ధరమ్ తేజ్ తదితరులు హాజరయ్యారు. నిశ్చితార్దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పో స్ట్ చేసిన కొన్ని పోస్టులు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.

"ఆమెను ప్రేమిస్తున్నాను.  నాకు ప్రేమంటే తెలిసింది ఆమె వల్లే. మా ఇద్దరి ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నా చిన్నప్పటి నుంచి  సురేఖ గారు - చిరంజీవి బాబాయిల ఆశీస్సులు ఎప్పుడూ ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు. అలాగే "నా జీవితం నీకే సొంతం. ప్రేమ తెలిసిన నీతోనే నిశ్చితార్థం జరిగింది.

ప్రస్తుతం నా మనసు గాల్లో తేలుతుంది" అని ఇన్ స్టాలో అభిప్రాయపడింది మేఘన.  ఈ యంగ్ హీరో మెగాస్టార్ నటించిన 'ఆచార్య'లో చిన్న పాత్ర పోషించాడు. ప్రస్తుతం పవన్  GA2 పిక్చర్స్ లో  ఒక ప్రాజెక్ట్‌కు సంతకం చేసాడు.   దీనికి తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నాడు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.