Begin typing your search above and press return to search.

మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ వినూత్నంగా ప్లాన్ చేస్తున్న డై హార్డ్ ఫ్యాన్స్...!

By:  Tupaki Desk   |   9 Aug 2020 7:46 AM GMT
మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ వినూత్నంగా ప్లాన్ చేస్తున్న డై హార్డ్ ఫ్యాన్స్...!
X
మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22న తన 65 పుట్టినరోజును జరుపుకోనున్నారు. ప్రతి ఏడాది చిరంజీవి బర్త్ డే నాడు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తుంటారు. ఈ ఏడాది కూడా సెలబ్రేషన్స్ చేయడానికి డై హార్డ్ ఫ్యాన్స్ ఇప్పటి నుండే ప్రణాళికలు మొదలు పెట్టేసారు. ఈ క్రమంలో #ChiruBdayFestBegins హ్యాష్ ట్యాగ్స్ పెడుతూ ఇప్పటికే సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. కాగా ఇప్పుడు తమ ఫేవరేట్ హీరోల ఫోటోలను అందరూ కామన్ డీపీలుగా పెట్టుకొని బర్త్ డేని సెలబ్రేట్ చేయడం ట్రెండ్ గా కొనసాగుతోంది. అంతేకాకుండా ఈ కామన్ డిస్ప్లే పిక్చర్ (డీపీ)ని వేరే సెలబ్రెటీలతో సోషల్ మీడియా మాధ్యమాలలో రిలీజ్ చేయిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కామన్ మోషన్ పోస్టర్ ని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని 65 మంది సెలబ్రిటీల చేతుల మీదుగా రిలీజ్ చేయించడానికి ప్లాన్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ విధంగా ఏ హీరో బర్త్ డే ని సెలబ్రేట్ చేయలేదని చెప్పవచ్చు. ఇప్పటికే మెగాస్టార్ కామన్ మోషన్ పోస్టర్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సీఎంపీ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారనేది త్వరలోనే ప్రకటించనున్నారు. ఇక రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి అభిమాన సంఘం మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా ఆయనకి విషెస్ తెలియజేస్తూ ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. 'మెగాస్టార్స్ మెగా ర్యాప్' పేరుతో విడుదల కానున్న ఈ పాటను ఆగస్టు 21న రిలీజ్ చేయనున్నారు.