నెట్టింట వైరల్ గా మారిన మెగా ఫ్యాన్ మేడ్ పోస్టర్!

Sat Sep 24 2022 18:00:01 GMT+0530 (India Standard Time)

Mega Fans Made Poster on Mega Heros

ఫేవరేట్ స్టార్ సినిమా వచ్చేస్తోందంటే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా వాడకం మొదలైన దగ్గరి నుంచి ఫ్యాన్స్ అభిమాన హీరోల సినిమాలని విస్తృతంగా ప్రచారం చేస్తూ నెట్టింట రికార్డు స్థాయిలో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. ఫ్యాన్ మేడ్ పోస్టర్లని క్రియేట్ చేస్తూ మరింతగా వైరల్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్'.  మలయాళ ఫిల్మ్ ఆధారంగా ఈ మూవీని తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రలో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 5న దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా రిలీజ్ కు సరిగ్గా 11 రోజులు మాత్రమే వున్నాయి. అ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ యాక్టివిటీస్ ని ప్రారంభించేసింది. చిరుని ప్రత్యేకంగా ఫ్లైట్ లో శ్రీముఖి చేసిన చిట్ చాట్ వీడియో ప్రోమోలని రిలీజ్ చేశారు.

ఈ నెల 25న పూర్తి స్థాయి ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోని విడుదల చేయబోతున్నారు. శుక్రవారం ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మేకర్స్ 'గాడ్ ఫాదర్' కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. అంతా వైట్ అండ్ వైట్ ధరించి వెనకాల వస్తుండగా చిరు మాత్రం ఫుల్ స్వాగ్ లో బ్లూకరల్ షర్ట్ వైట్ లుంగీ ధరించి ముందు వెళుతున్న స్టిల్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ స్టిల్ ని ప్రధానంగా వాడుకుంటూ 'భీమ్లానాయక్' లో పవన్ గళ్ల లుంగీ కట్టుకున్న స్టిల్‌ని 'రంగస్థలం'లో చిట్టిబాబుగా రామ్ చరణ్ లుంగీతో వున్న స్టిల్ ని కలిపి మెగా ఫ్యాన్స్ ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ని క్రియేట్ చేశారు.

ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ముగ్గరు బ్లాక్ థీమ్ షర్ట్ వేసుకున్నట్టుగా డిజైన్ చేశారు. అంతే కాకుండా పవన్ కల్యాణ్ ని 'గాడ్ ఆఫ్ మాసెస్'గా చిరుని 'బాస్ ఆఫ్ మాసెస్' గా రామ్ చరణ్ ని 'మాన్ ఆఫ్ మాసెస్' గా అభివర్ణించారు.

ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ ముగ్గురు కలిసి ఒకే సినిమాలో నటిస్తే చూడాలని ఫ్యాన్స్ చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ కల ఇప్పటికైనా తీరేనా.. మెగా మనం అనే స్థాయిలో ఏ దర్శకుడైనా ఆలోచనతో వస్తే ఈ ముగ్గరు కాదంటారా? అనే కామెంట్ లు నెట్టింట వినిపిస్తున్నాయి. అంతా ఆశపడుతున్నట్టుగా ఈ ముగ్గురు కలిసి చెలరేగితే ఫ్యాన్స్ కి పండగే మరి. ఆ రోజు త్వరలోనే రావాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.