జిగేల్ రాణీ కాదు లీకుల రాణి అనాలేమో!

Sat Mar 06 2021 11:00:02 GMT+0530 (IST)

Mega Fans Funny Trolls On Pooja Hegde

వార్తను గుట్టుగా దాచడం కష్టం. నరనారాయణుడి నోట్లో ఏదీ నిలవదని అంటారు. చాలా మంది స్టార్లకు ఇది వర్తిస్తుంది. ఏదైనా అండర్ ప్రొడక్షన్ ఉన్న సినిమాకి సంబంధించిన ఏదీ బయటకు తెలియకూడదనే దర్శకనిర్మాతలు అనుకుంటారు. కానీ ఒక్కోసారి అనుకోకుండా లీకులు బయటపడిపోతుంటాయి.అలానే ఇంతకుముందు ఓ చిన్న సినిమా ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కొరటాలతో తన మూవీ టైటిల్ ఆచార్య అంటూ లీక్ చేసేశారు. ఎలాంటి ఈవెంట్ హంగామా లేకుండా టైటిల్ ని ఆయన చెప్పేయడంతో పక్కనే ఉన్న దర్శకుడు కొరటాల సహా అంతా షాకయ్యారు.

ఆ తర్వాత కూడా చిత్రబృందం అధికారికంగా కన్ఫామ్ చేయకముందే పూజా హెగ్డే .. తాను ఆచార్య చిత్రంలో నటిస్తున్నానని చెప్పేయడంతో ఆ క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది. పూజాని జిగేల్ రాణీ అని కాదు.. లీకుల రాణి అనాలి! అంటూ మెగాభిమానులు సరదాగా ఆటపట్టిస్తున్నారు. చిరు టైటిల్ లీకిచ్చినట్టే పూజా కూడా ఎంతో సింపుల్ గా లీకులిచ్చేసిందనేది అభిమానుల మాట.

ఆచార్య చిత్రంలో పూజా చేస్తున్నది ఒక చిన్న రోల్ మాత్రమే. మాంటేజ్ షాట్స్ లో కనిపించనుందని లీకులు అందాయి. ప్రస్తుతం చిరు వీడియోతో పాటు పూజా వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చరణ్ ఈ చిత్రంలో సిద్ధ అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే అతడిపై టాకీ పూర్తయింది. మే 14న ఈ సినిమా రిలీజ్ కానుంది.