Begin typing your search above and press return to search.

మెగాబ్రాండ్ 1మిలియ‌న్ మార్క్ ని ట‌చ్ చేయ‌లేదే!

By:  Tupaki Desk   |   16 May 2022 5:37 AM GMT
మెగాబ్రాండ్ 1మిలియ‌న్ మార్క్ ని ట‌చ్ చేయ‌లేదే!
X
అమెరికా మార్కెట్ లో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు సునాయాసంగా వ‌న్ మిలియ‌న్ మార్క్ ని ట‌చ్ చేస్తున్నాయి. పాజిటివ్ టాక్ వ‌స్తే ఒక్క రోజులోనే ఆ ఫీట్ ని అందుకోగల్గుతున్నారు. మీడియం రేంజ్ హీరోలు సైతం స‌రైన కంటెంట్ తో వ‌స్తే ఇమేజ్ తో సంబంధం లేకుండా యూఎస్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్లు అయితే ప్రీమియం వ‌సూళ్ల‌తోనే ఆ రికార్డుని చేధిస్తున్నారు.

అమెరికాలో తెలుగు ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ హీరోల్ని శిఖ‌రాగ్రాన నిల‌బెట్టింది. డే బై డే తెలుగు సినిమా మార్కెట్ ఓవ‌ర్సీస్ లో మ‌రింత విస్తృతం అవుతుంది. అయితే గ‌త ఐదేళ్ల‌లో రిలీజ్ అయిన మెగా హీరోల సినిమాలు చూస్తే ఈ రేసులో కాస్త వెనుక‌బాటు త‌న‌మే క‌నిపిస్తుంది. ఇటీవ‌లే మెగాస్టార్ చిరంజీవి-మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన 'ఆచార్య' ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన‌ సంగ‌తి తెలిసిందే.

ఇద్ద‌రు స్టార్ హీరోలు..అంత‌కు మించి మెగా ఇమేజ్ తో 'ఆచార్య‌' వ‌న్ మిలియ‌న్ మార్క్ పెద్ద కష్ట‌మే కాద‌ని అంతా భావించారు. కానీ బాక్సాఫీస్ లెక్క మాత్రం నిరాశ‌నే మిగిల్చింది.

'ఆచార్య' వ‌న్ మిలియ‌న్ కి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చింది త‌ప్ప‌.. ఆ క్ల‌బ్ లో చేర‌లేక‌పోయింది. 985 కె వసూళ్ల‌తో ఖాతా క్లోజ్ చేసింది. అంత‌కు ముందు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన 'వ‌కీల్ సాబ్' కూడా వ‌న్ మిలియ‌న్ క్ల‌బ్ లో చేర‌లేక‌పోయింది.

ఈ సినిమా 750 కె తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. 'వ‌కీల్ సాబ్' కి పాజిటివ్ టాక్ వ‌చ్చినా ప‌వ‌న్ ఇమేజ్ అమెరికాలో ఇంకా వీక్ గానే ఉంద‌ని తెలుస్తుంది. ఇక మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ గ‌త సినిమా 'విన‌య విధేయ రామ' అయితే ఘోర‌మైన ఓపెనింగ్స్ నే రాబ్ట‌టింది. ఈ సినిమా యూ ఎస్ బాక్సాఫీస్ వ‌ద్ద 260 కె వ‌సూళ్ల‌తో డీలా ప‌డింది. ఈ మూడు సినిమాల ఓవ‌ర్సీస్ చూస్తే స్ట‌న్ అవ్వాల్సిందే.

ఆమెరికాలో మెగా ఇమేజ్ ఇంత బ‌ల‌హీనంగా ఉందా? అన్న సందేహం రాక‌మాన‌దు. మెగా మేన‌ల్లుడిగా.. అల్లు అర‌వింద్ త‌న‌యుడిగా ప‌రిచ‌య‌మైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన 'స‌రైనోడు' కూడా వ‌న్ మిలియ‌న్ వ‌సూళ్ల క్ల‌బ్ లో చేర‌లేదు. 880 కె వ‌సూళ్ల‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. మెగా హీరోల చిత్రాల‌తో పోలిస్తే బ‌న్నీ ఓ ర‌కంగా ప‌ర్వాలేదు. బ‌న్నీ అమెరికా మార్కెట్ వాళ్ల‌క‌న్నా మెరుగ్గానే ఉంద‌నిపిస్తుంది. మ‌రి ఈ లెక్క‌ల‌న్ని స‌వ‌రించాలంటే న‌యా హీరోలు హింట్ కంటెంట్ తో వ‌స్తే త‌ప్ప సాధ్య‌కాని ప‌ని.