మెగా ఫ్యామిలీలో బర్త్ డే హంగామా

Mon May 27 2019 11:40:32 GMT+0530 (IST)

Mega Family Birthday Hungama

మెగా ఫ్యామిలీలో ఏదైనా ఒక వేడుక చేసుకోదగ్గ సందర్భం వచ్చిందంటే చాలు అందరూ ఒకచోట చేరతారు. ఫుల్ గా చిల్ అవుట్ అవుతారు.  అసలే మెగా ఫ్యామిలీలో స్టారాధిస్టారులు ఉండడంతో వారి హంగామాను చూసేందుకు రెండు కళ్ళూ చాలవు. తాజాగా మెగా కుటుంబంలో అలాంటి సందర్భమే వచ్చింది.మెగా హీరోలకు ఒక కజిన్ అయిన దీప్తి జన్మదిన సందర్భంగా ఈ సెలబ్రేషన్ జరిందని సమాచారం. రామ్ చరణ్.. ఉపాసన.. అల్లు అర్జున్.. స్నేహ.. వరుణ్ తేజ్.. శిరీష్.. నిహారిక.. సుష్మిత.. శ్రీజ.. ఇలా చాలామంది గ్యాంగ్ ఒక చోట  చేరి ఫుల్ గా ఎంజాయ్ చేశారు.  ఈ సందర్భంగా దిగిన ఫోటోనే ఇది.  అందరి మొహాల్లో నవ్వులే నవ్వులు. ఇక బర్త్ డే జరుపుకున్న దీప్తి ఈ మెగా గ్యాంగ్ సందడితో ఫుల్ హ్యాపీగా కనిపిస్తోంది.

దాదాపుగా అందరూ ఈ ఫోటోలో క్యాజువల్ డ్రెస్సులలో ఉన్నారు. ఎక్కువమంది బ్లాక్ డ్రెస్ లో ఉన్నారు. నిహారిక అయితే అన్నయ్య చరణ్ పై చేతులేసి మరీ నవ్వుతోంది. ఏదేమైనా మెగా ఫ్యామిలీలో ఒక తెలియని అనుబంధం.. ప్రేమాభినానాలు ఉంటాయి కదా? ఫోటోకు అందరూ పోజిచ్చిన తీరులోనే అది మనకు తెలిసిపోతుంది.