Begin typing your search above and press return to search.

ఏక్ మినీ కథ హీరోతో మెగా డాట‌ర్..!

By:  Tupaki Desk   |   20 Jun 2021 11:30 AM GMT
ఏక్ మినీ కథ హీరోతో మెగా డాట‌ర్..!
X
వ‌ర్షం ద‌ర్శ‌కుడు శోభ‌న్ వార‌సుడు సంతోష్ శోభ‌న్ హీరోగా ఇటీవ‌లే కెరీర్ తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు. యువి సంస్థ నిర్మించిన‌ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఏక్ మినీ కథతో మంచి ముద్ర వేసిన అత‌డు బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో కెరీర్ ప‌రంగా బిజీ అవుతున్నారు. తదుపరి మంచి రోజులు వ‌చ్చాయి అనే చిత్రంలో సంతోష్ న‌టించారు. ఇందులో మెహ్రీన్ క‌థానాయిక‌. ఈ మూవీ కూడా త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో మరొక చిత్రంలోనూ అత‌డు న‌టించ‌నున్నారు.

తాజా సమాచారం మేర‌కు 2017 తమిళ థ్రిల్లర్ 8 తోట్టక్కల్ తెలుగు రీమేక్ లో సంతోష్ శోభన్ ప్రధాన పాత్ర పోషించడానికి చర్చలు జరుపుతున్నారు. ఈ రీమేక్ తో చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత నిర్మాతగా తన చలన చిత్ర ప్రవేశం చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. 8 తోటక్కల్ కు యువ కోలీవుడ్ దర్శకుడు శ్రీ గణేష్ తెలుగు వెర్షన్ కు కూడా దర్శకత్వం వహించనున్నారు. మరిన్ని వివరాల్ని వెల్ల‌డించ‌నున్నార‌ని తెలిసింది.

సంతోష్ శోభ‌న్ కి మంచి అవ‌కాశాలొస్తున్నాయి. ప్ర‌తిదీ స‌ద్వినియోగం చేసుకుని హీరోగా మ‌రింత‌గా రాణిస్తాడ‌నే ఆశిద్దాం. వ‌ర్షంతో త‌న‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ ని ఇచ్చిన త‌న ద‌ర్శ‌కుడి వార‌సుడి కోసం ప్ర‌భాస్ త‌న‌వంతు సాయం చేస్తుండ‌డం ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.