ఫోటో స్టోరీ: మెగా హాట్ హీరోయిన్.. నో బటన్స్!

Wed Feb 19 2020 14:54:44 GMT+0530 (IST)

Mega Daughter Takes The Glamour Route and Goes Unbuttoned!

మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మొదటి అమ్మాయి నిహారిక. ఇప్పటి వరకూ నిహారిక మూడు సినిమాలలో నటించింది కానీ బ్రేక్ మాత్రం దక్కలేదు. పేరున్న ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కావడంతో గ్లామరస్ పాత్రలు ఇచ్చేందుకు టాలీవుడ్ మేకర్స్ తటపటాయించడం సహజమే. దీంతో నిహారికకు కొంచెం ప్రాధాన్యం ఉన్న పాత్రలే తప్ప గ్లామర్ డాల్ లాంటి పాత్రలు రావడం లేదు. ఈ విషయం గ్రహించిందేమో కానీ నీహారిక మెగా గ్లామర్ గేర్ వేసేసింది.ఈ జెనరేషన్ అమ్మాయి కదా.. అందుకే నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా నిహారిక తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక హాట్ ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "మీకు దేనివల్ల చిరునవ్వు వస్తుంది?" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఫోటోలో ఒక బాలీవుడ్ హీరోయిన్ స్టైల్ లో జీన్ ప్యాంట్.. బటన్లు వేసుకోకుండా షర్టు ధరించి హాట్ పోజు ఇచ్చేసింది. నెటిజన్లకు నిద్ర ఉండదని ఫిక్స్ అయిపోయిందేమో కానీ కిలకిలా నవ్వుతూ ఉంది. ఇంత హాట్ నెస్ మెగా హీరోయిన్ నుంచి ఎవరూ ఊహించి ఉండరు అది మాత్రం 100 శాతం నిజ్జం!

ఈ ఫోటోకు నెటిజన్ల నుండి స్పందన అదిరిపోయింది. "మెగా హీరోయిన్.. అందరూ పక్కకు తప్పుకోండి".. "నీ స్మైల్ తో నాకు స్మైల్ వస్తుంది ".. "సూపర్ క్యూట్ మెగా హాట్" అంటూ కామెంట్లు పెట్టారు. నిహారిక చేతిలో ప్రస్తుతం ఆఫర్లేవీ లేవు కానీ ఇలా మెగా హాటు గేర్ వేసింది కాబట్టి త్వరలో కొత్త ఆఫర్లు నిహారిక హ్యాండ్ బ్యాగులో పడడం పక్కా.