Begin typing your search above and press return to search.

మెగా హాట్ సిగ్నల్స్ బాలీవుడ్ కోసమేనా?

By:  Tupaki Desk   |   20 Feb 2020 6:00 AM GMT
మెగా హాట్ సిగ్నల్స్ బాలీవుడ్ కోసమేనా?
X
నేను లంచం ఇవ్వను ఇవ్వనని భీష్మించుకుని కూర్చుంటే గవర్నమెంట్ ఆఫీసుల్లో అన్నీ పనులు అవుతాయా? చచ్చినా కావు. అబద్ధాలు చెప్పకుండా ఒక రోజు గడుస్తుందా? గడవదు.. నిజాలు చెప్తే అనుక్షణం నరకమే. ఇలానే గ్లామర్ ఫీల్డ్ లో నేను క్యూట్ గా కనిపిస్తాను.. గ్లామర్ ప్రదర్శనలకు ఆమడ దూరం అని గిరిగీసుకుని కూర్చుంటే ఎమౌతుంది? ఆ ఆఫర్లను వేరే హాటు పాపలు గద్దల్లా తన్నుకుపోతారు. అసలే న్యూడ్ ఫోటో షూట్లు రాజ్యమేలే కాలమిది. అందుకే హాట్ ఫోటోషూట్లు హీరోయిన్లకు మినిమమ్ రిక్వైర్ మెంట్.

ఈ ఇంట్రో అంతా ఎందుకంటే మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. మూడు సినిమాలు చేసింది. అవన్నీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల తరహాలో లేవు. నిహారిక కూడా రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ లా కనిపించలేదు. క్యూట్ గానో లేక నటన ప్రధానం ఉన్న పాత్రలోనో కనిపించింది. దీంతో ఆటోమేటిక్ గా ఆఫర్లు తగ్గిపోయాయి. మెగా ఫ్యామిలీ అమ్మాయి కాబట్టి అందరూ హీరోయిన్లకు ఆఫర్ చేసే గ్లామర్ పాత్రలు.. బోల్డ్ క్యారెక్టర్స్ నిహారికకు ఇవ్వలేరు. దీంతో పెద్ద చిక్కొచ్చి పడింది. ఈ విషయం అర్థం చేసుకుందేమో కానీ రూటు మార్చింది. గ్లామర్ గేర్ వేసింది. ఈమధ్య ముంబైలో ఒక ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ ఆధ్వర్యంలో జరిగిన ఫోటో షూట్ లో పాల్గొందని వార్తలు వచ్చాయి. నిహారిక కూడా వరసగా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా హాట్ ఫోటోలతో నెటిజన్ల పై దాడి చేస్తోంది. దీంతో నిహారిక హీరోయిన్ గా తన సత్తా చాటాలని.. అందుకు బోల్డ్ పాత్రలకు కూడా తను సిద్ధమేనని హింట్ ఇచ్చినట్టయింది.

టాలీవుడ్ లో హీరోయిన్లకు మొదటి నుంచి కొరత ఉంది. ఇప్పుడు ఎలాగూ హాట్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి నిహారికను కొత్త సినిమాలకు హీరోయిన్ గా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ హాట్ సిగ్నల్స్ గురించి మరో టాక్ కూడా వినిపిస్తోంది. నిజానికి నిహారిక ఈ హాట్ ఫోటో షూట్ చేసింది బాలీవుడ్ ఎంట్రీ కోసమని.. బాలీవుడ్ లో తన అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టిందని అంటున్నారు. ఇది నిజమో కాదో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.