మెగా 152 ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Fri Nov 15 2019 15:44:40 GMT+0530 (IST)

Mega 152 New Update

సైరా నరసింహారెడ్డి కోసం చాలా ఎక్కువ సమయం తీసుకున్న మెగాస్టార్ తన 152వ చిత్రంను మాత్రం చాలా ఫాస్ట్ గా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ లోనే మెగా 152 చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఆ చిత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాని ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన చిత్రీకరణ మాత్రం మొదలు పెట్టలేదు. డిసెంబర్ నుండి షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నాయని సమాచారం అందుతోంది. సినిమా ఇంకా షూట్ ప్రారంభం కాకుండానే హడావుడి ఆగం ఆగంగా ఉంది.చిరు.. కొరటాల మూవీ గురించి గత ఏడాది కాలంగా ప్రచారం జరుగుతోంది. సైరా విడుదల తర్వాత సినిమా గురించిన వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం సినిమాకు గోవింద ఆచార్య టైటిల్ పెట్టారంటూ ఒక పోస్టర్ కూడా వచ్చింది. కాని అది నిజం కాదంటూ నిర్మాణ సంస్థ అఫిషియల్ గా క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం కోసమని దర్శకుడు కొరటాల శివ 'గోవిందా హరి గోవిందా' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

కొన్ని రోజులుగా ఈ టైటిల్ తెగ సర్క్యులేట్ అవుతున్నా కూడా ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యులు ఎవరు కూడా ఖండించక పోవడంతో గోవిందా హరి గోవిందా ఖరారు చేసి ఉంటారని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆ టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ కోసం దరకాస్తు వెళ్లిందంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సినిమా టైటిల్ ను ముందే ప్రకటించే ఉద్దేశ్యంతో దర్శకుడు కొరటాల శివ టైటిల్ ను కన్ఫర్మ్ చేశాడట.

దేవాలయాలు మరియు వాటిల్లో జరుగుతున్న అవినీతిపై పోరాటమే ఈ చిత్రం అంటూ మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. ఆ నేపథ్యంకు తగ్గట్లుగా గోవిందా హరి గోవిందా టైటిల్ ను ఖరారు చేశారు అంటూ మెగా కాంపౌండ్ లో చర్చ జరుగుతోంది. చిరంజీవి ఈ చిత్రంలో డబుల్ రోల్ అంటూ వార్తలు వస్తున్నాయి. కాని ఇప్పటి వరకు ఆ విషయమై క్లారిటీ ఇవ్వలేదు. ఇక హీరోయిన్స్ విషయంలో కూడా ఇప్పటి వరకు వార్తలు రావడమే మినహా క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఈ ప్రశ్నలన్నింటికి కూడా వచ్చే నెలలో సినిమా సెట్స్ పైకి వెళ్లిన తర్వాత కొరటాల సమాధానం ఇస్తాడేమో చూడాలి.