Begin typing your search above and press return to search.

ఏపీ సీఎంతో సినీ పెద్దల భేటీ 'లవ్ స్టోరీ' చిత్రానికి కలిసొస్తుందా..?

By:  Tupaki Desk   |   14 Sep 2021 2:15 PM GMT
ఏపీ సీఎంతో సినీ పెద్దల భేటీ లవ్ స్టోరీ చిత్రానికి కలిసొస్తుందా..?
X
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకోవడంతో ఎప్పటిలాగే ప్రతీవారం కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి. అయితే తెలంగాణలో పూర్తి స్థాయిలో సినిమాలు ప్రదర్శించబడుతున్నా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా షరతులు ఉన్నాయి. సినిమా హాళ్లలో 50 శాతం ఆక్యుపెన్సీతో పాటుగా నైట్ కర్ఫ్యూ కారణంగా మూడు షోలకే అనుమతి ఉంది. ఏపీలో ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు విడుదల చేయాల్సి వస్తున్న తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

సెప్టెంబర్ 20న ఆంధ్రప్రదేశ్ సీఎంతో సినీ ప్రముఖుల భేటీ ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని బృందం ఈ మీటింగ్ లో ఇండస్ట్రీ సమస్యలపై చర్చించనుంది. ఇదివరకే ఈ భేటీ జరగాల్సి ఉండగా.. పలు కారణాలతో వాయిదా పడింది. సీఎం జగన్ తో సినీ పెద్దలు భేటీ విషయమై మంత్రి పేర్ని నాని కూడా క్లారిటీ ఇచ్చారు. థియేటర్ సమస్యలు - టికెట్ ధరలు - స్పెషల్ బెనిఫిట్ షోలు - డిస్ట్రిబ్యూషన్ - ఎగ్జిబిటర్ రంగాలలోని సమస్యలను సినీ పెద్దలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది.

ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో కొన్ని మార్పులు సూచించే అవకాశం కనిపిస్తోంది. వీటన్నింటిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే థియేటర్లలో రరావడానికి చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి. ఒకవేళ దీనిపై వెంటనే సానుకూల పప్రకటన వస్తే అది నాగచైతన్య 'లవ్ స్టోరీ' చిత్రానికి కలిసొస్తుందని చెప్పవచ్చు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24న థియేట్రికల్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సీఎంతో సినీ పెద్దల చర్చలు సఫలం అయితే మాత్రం అది 'లవ్ స్టోరీ' చిత్రానికి చాలా ప్లస్ అవుతుంది. ఈ భేటీలో అక్కినేని నాగార్జున కూడా ఉంటారు కాబట్టి.. సెప్టెంబర్ 24 నుంచే షరతులు ఎత్తేసేలా ఏమైనా సానుకూల ఫలితం రాబడతారేమో చూడాలి.