'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ప్రీ టీజర్ వచ్చేసింది...!!

Mon Oct 19 2020 12:15:20 GMT+0530 (IST)

Pre-Teaser: Meet Harsha, The 'Most Eligible Bachelor'!

యువ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్''. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాస్ - వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. కరోనా లాక్ డౌన్  కారణంగా నిలిచిపోయిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ లిరికల్ సాంగ్ విశేష ఆదరణ పొందాయి. ఈ క్రమంలో తాజాగా ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రీ టీజర్ రిలీజ్ చేశారు.''హాయ్ ఐ యామ్ హర్ష.. ఒక అబ్బాయి లైఫ్ లో 50 పర్సెంట్ కెరీర్.. 50 పర్సెంట్ మ్యారీడ్ లైఫ్. కెరీర్ ని సూపర్ గా సెట్ చేశా.. కానీ ఈ మ్యారీడ్ లైఫ్.. అయ్యయ్యోయ్యో..'' అని అఖిల్ ప్రీ టీజర్ లో చెప్తున్నాడు. 'హర్ష' తన కెరీర్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాడు.. కానీ అతను తన మ్యారీడ్ లైఫ్ గురించి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాడనేది తెలియాలంటే అక్టోబర్ 25 ఉదయం 11:40 గంటల వరకు వేచి చూడమని చిత్ర యూనిట్ ప్రకటించింది. మొత్తం మీద ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రీ టీజర్.. పూర్తి టీజర్ ని చూడాలనే ఆసక్తిని కలిగిస్తోంది. ఇక ఈ మూవీలో బొమ్మరిల్లు భాస్కర్ గత చిత్రాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంపై అక్కినేని ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాన్ని 2021 సంక్రాంతి సీజన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.