Begin typing your search above and press return to search.

మీరా జాస్మిన్ ఇజ్ బ్యాక్.. టాలీవుడ్ కు రీ ఎంట్రీ..

By:  Tupaki Desk   |   1 Feb 2023 3:38 PM GMT
మీరా జాస్మిన్ ఇజ్ బ్యాక్.. టాలీవుడ్ కు రీ ఎంట్రీ..
X
ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి.. ఫ్లాపులు, ఫేడవుట్ అవడం, కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకోవడం.. ఇలా రకరకాల కారణాల వల్ల కనుమరుగైపోయిన భామలు చాలా మందే ఉన్నారు. వారిలో కొంతమంది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. నదియా, మీనా, సిమ్రాన్, దేవయాని, ఖుష్బూ, రాధిక, భూమిక, స్నేహా, మమతా మోహన్ దాస్.. ఇలా పెద్ద జాబితానే ఉంది.

వీళ్లల్లో చాలా మందికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తుంటే.. మరికొంత మంది మాత్రం మేం మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ దర్శక నిర్మాతలకు హింట్స్ ఇస్తున్నారు. అందుకోసం హాట్ హాట్ ఫొటోషూట్లతో వలపు వయ్యారాలు ఒలకబోస్తున్నారు. వీరిలో మలయాళీ భామ మీరా జాస్మిన్ కూడా ఉంది.

కొంత కాలంగా తన గ్లామర్ లుక్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారు హార్ట్ బ్రేక్ చేస్తోంది. ఒకప్పుడు హోమ్లీ లుక్స్‌తో వెండితెరపై అలరించిన మీరా ఇప్పుడు హాట్ గేర్ వేసి సోషల్ మీడియా లో హాట్ పుట్టిస్తోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ హాట్ అండ్ స్వీట్ పిక్స్ షేర్ చేస్తూ నెట్టింట ఫుల్ ఆక్టివ్ గా ఉంటోంది.

అలా తన గ్లామర్ వలను వేసి అవకాశాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. తెలుగులో చివరిసారిగా 2013లో మోక్ష చిత్రంలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తమిళ్, మలయాళం చిత్రాల్లోనే కనిపించింది. ఈ క్రమంలోనే 2018 నుంచి సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.

చివరిసారిగా గతేడాది 2022లో మకల్ అనే మలయాళ సినిమాతో రే ఎంట్రీ ఇచ్చింది. తెలుగులోనూ ఛాన్సులు కోసం తెగ ట్రై చేస్తోంది. ఈక్రమంలోనే తాజా ఇన్స్ట్ స్టోరీస్ లో ఓ కొత్త పొస్ట్ చేసింది. డబ్బింగ్ చెబుతూ కనిపించింది. బ్యాక్ టు తెలుగు సినిమా అని వ్యాఖ్య రాసు కొచ్చింది. అయితే ఆ సినిమా ఏంటనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇది చూసిన అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు.

కాగా, 2001లో మలయాళంలో కథానాయికగా కెరీర్ ప్రారంభించిన మీరా.. ఆ తర్వాత అమ్మాయి బాగుంది మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. అనంతరం గుడుంబా శంకర్, భద్ర, మహారథి లాంటి సినిమాలు చేసింది. గోరింటాకు లో రాజశేఖర్ చెల్లెలిగా కనిపించి ఆకట్టుకుంది. కన్నడతో పాటు తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసింది కానీ హిట్స్‌తో పాటు అవకాశాలూ తక్కువయ్యాయి. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.