ఫోటో స్టోరీ: బంగారం బ్యూటీ 2.0

Mon Jun 01 2020 19:00:49 GMT+0530 (IST)

Photo Story: Bangaram Beauty 2.0

హీరోయిన్ మీరా చోప్రా పేరు చెప్పగానే ఎక్కువమంది తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టకపోవచ్చు. ఎందుకంటే ఈ భామ నటించిన సినిమాలేవీ హిట్టు కాలేదు. పవన్ కళ్యాణ్ 'బంగారం'.. ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన 'వాన' లో మీరా హీరోయిన్. తెలుగులో పెద్దగా బ్రేక్ రాకపోవడంతో హిందీ.. తమిళంపై దృష్టి సారించింది. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది.తాజాగా మీరా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "ప్రకృతి ఎంతో అందంగా ఉంది. మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటే వెంటనే మన ఆరోగ్యం మెరుగైనట్టు భావిస్తాం. నేను ఇక్కడే బాల్కనీలో కూర్చుని ఉంటా.. ఎక్కడికీ పోను" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నిజమే ప్రకృతి అందంగా ఉంటే మనకు సంతోషంగా ఉంటుంది. కూల్ వెదర్ లో ఒకరికి వేడివేడి పకోడీలు.. మరొకరికి బజ్జీలు తినాలనిపిస్తుంది. కొందరికేమో ఆ వేడి స్నాక్స్ తో చిల్డుగా మరొకటేదో ఉంటే కెవ్వుకేక అని వినిపిస్తుంది.

ఈ ఫోటోలో స్లీవ్ లెస్ టీ షర్టు.. ప్రింటెడ్ కలర్స్ బాటమ్ ధరించి జాలీగా బాల్కనీలో రిలాక్సింగ్ ఛెయిర్ లో కూర్చుంది. ఇక్కడ సమస్య ఏంటంటే అందగత్తెలు ఎప్పుడూ అలానే తాపీగా కూర్చుంటారు. అయితే వారు మగ సమాజానికి జగన్మోహినులుగా విశ్వమోహినునులుగా రోదసీమోహినులుగా కనిపిస్తూ వారిలో నివురుగప్పి ఉన్న అగ్నిని జ్వలింపజేసి వారి మనసులను కల్లోలభరితం చేస్తారు. స్త్రీద్వేషుల సమాజ సభ్యులు కూడా ఈ ఫోటోల దెబ్బకు రివర్సుగా మారిపోతారు. వారి బూర్జువా సిద్ధాంతాలు పక్కన పెట్టి సాధారణ మనుషులవుతారు. ఇక మీరా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం 'నాస్తిక్' అనే ఓ హిందీ సినిమాలో నటిస్తోంది.