Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : ఖిలాడీ బ్యూటీ కిరాక్ అందం మతి పోగొట్టే చూపులు

By:  Tupaki Desk   |   10 May 2022 2:30 AM GMT
ఫోటోటాక్ : ఖిలాడీ బ్యూటీ కిరాక్ అందం మతి పోగొట్టే చూపులు
X
మోడల్ గా కెరీర్‌ ను ఆరంభించిన మీనాక్షి చౌదరి బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో ఇండస్ట్రీలో మెల్ల మెల్లగా స్టార్‌ డమ్‌ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తెలుగు లో ఈ అమ్మడు మొదట ఇచట వాహనాలు నిలుపరాదు అనే సినిమాలో నటించింది. ఆ సినిమాలో ఈ అమ్మడి నటన మరియు లుక్స్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని ఖిలాడి సినిమాలో ఛాన్స్ ను దక్కించుకుంది.

ఖిలాడీ సినిమాలో రవితేజ తో రొమాన్స్ చేసిన మీనాక్షి చౌదరి కి మంచి గుర్తింపు దక్కింది. ఆ సినిమా కమర్షియల్‌ గా నిరాశ పర్చడంతో టాలీవుడ్‌ లో ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. మంచి సినిమా ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ఈ అమ్మడు త్వరలోనే ఒక తమిళ సినిమాకు సైన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆమె తెలుగు మరో తెలుగు సినిమాను చేస్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి.

హీరోయిన్ గా ఇప్పటి వరకు బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ హిట్‌ ను అయితే అందుకోలేదు కాని సోషల్‌ మీడియాలో తన అందాల ఆరబోత తో అందరిని ఆకట్టుకుంటూ స్టార్‌ హీరోయిన్‌ రేంజ్ అని నిరూపించుకుంటుంది. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడికి ఉన్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. ఖచ్చితంగా ఈ అమ్మడు మంచి హీరోయిన్ గా భవిష్యత్తులో పేరు దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

మీనాక్షి చౌదరి తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలను చేసేందుకు ఆసక్తిగా ఉంది. చూడగానే వావ్ అనిపించే అందం ఈ అమ్మడి సొంతం. అందుకే ఈమెకు కాస్త వెనుక ముందు అయినా కూడా మంచి కమర్షియల్‌ హిట్స్ దక్కడం ఖాయం.. తద్వారా ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్ గా నిలవడం ఖాయం అంటూ ఆమె అందాన్ని చూసిన వారు అంటున్నారు.

తాజాగా షేర్‌ చేసిన ఈ ఫోటో లో ఆమె అందంతో ఫిదా చేస్తోంది. అలా తొంగబడి చూస్తూ మతులు పోగొట్టేస్తుంది. తన అందాల విందు చేయడంతో కొంటె చూపుతో ఆకట్టుకోవడం తో ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని తెగ ఆకర్షిస్తున్నాయి. ఈ ఫోటోలు ఇండస్ట్రీకి చెందిన ఫిల్మ్‌ మేకర్‌ దృష్టిలో పడక పోతాయా ఛాన్స్ రాకపోతుందా అనేది చూడాలి.