Begin typing your search above and press return to search.

లిరిక‌ల్ సాంగ్.. మీనాచ్చికి శ్రీ‌విష్ణు ప‌డిపోయాడే!

By:  Tupaki Desk   |   14 Jan 2022 3:05 PM GMT
లిరిక‌ల్ సాంగ్.. మీనాచ్చికి శ్రీ‌విష్ణు ప‌డిపోయాడే!
X
యంగ్ హీరో శ్రీ‌విష్ణు బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అత‌డు న‌టించిన అర్జున ఫాల్గుణ విడుదలకు సిద్ధ‌మ‌వుతోంది. ఈలోగానే శ్రీవిష్ణు న‌టించిన మ‌రో చిత్రం `భ‌ళా తందనాన` అనే సినిమా చేస్తున్నాడు. చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. వారాహి చలనచిత్రం అధినేత‌ సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు సాగుతున్నాయి.

ఇంత‌కుముందు శ్రీ‌విష్ణు లుక్ కి సంబంధించిన పోస్ట‌ర్లు వైర‌ల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి మీనాచ్చి మీనాచ్చి సాంగ్ ప్రోమో విడుద‌లైంది. ప్ర‌యివేట్ మ్యూజిక్ లేబుల్ ద్వారా పాట‌ల్ని విడుద‌ల చేస్తున్నారు. లిరిక‌ల్ వీడియోని బ‌ట్టి ఈ సినిమా విలేజ్ నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే చిత్ర‌మ‌ని అర్థ‌మ‌వుతోంది.

కేజీఎఫ్ ఫేమ్ రామచంద్రరాజు కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. మణి శర్మ సంగీతం అందిస్తుండ‌గా.. సురేష్ రగుతు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా (పుష్ప: ది రైజ్ డైలాగ్ రైటర్) క‌థ‌ను అందించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ అందిస్తుండ‌గా.. గాంధీ నడికుడికర్ క‌ళా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌గ‌ధీర‌- రోబో వంటి టాప్ చిత్రాల‌కు యాక్షన్‌ కొరియోగ్ర‌ఫీ అందించిన పీటర్‌ హెయిన్ ఈ చిత్రానికి ప‌ని చేస్తున్నారని స‌మాచారం.