మీనా భర్త మృతికి కరోనాతో పాటు పావురాలు కారణం!

Wed Jun 29 2022 13:00:01 GMT+0530 (IST)

Meena's husband Vidyasagar passes away

సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందిన విషయం తెల్సిందే. బుధవారం ఉదయం కు వార్త తెలిసిన అందరూ కూడా షాక్ అయ్యారు. ఈ ఏడాది ఆరంభంలో కరోనా బారిన పడ్డ విద్యా సాగర్ అప్పటి నుండి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడని.. ఉపిరి తిత్తుల సమస్య కారణంగా శ్వాస తీసుకోలేక పోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది. నిన్న రాత్రి ఆ సమస్య ఎక్కువ అయ్యి మృతి చెందారు మొదట వచ్చిన వార్త.తమిళ మీడియాలో మీడియాలో ఆ తర్వాత మరో ఆసక్తికర కథనం ఒకటి చక్కర్లు కొడుతోంది. మీనా భర్త విద్యాసాగర్ మృతికి పోస్ట్ కరోనా సమస్యలు మాత్రమే కాదని పావురాల వ్యర్థాలు కూడా అంటూ సదరు కథనాలు పేర్కొన్నారు.

తమిళ మీడియా వర్గాల కథనం ప్రకారం మీనా నివాసం ఉంటున్న ఇంటికి కాస్త దూరంలో పావురాలు పెద్ద ఎత్తున ఉంటాయట. ఆ పావురాల వ్యర్థాల నుండి వచ్చిన వాసన వల్లే విద్యాసాగర్ ఊపిరి తిత్తులు చెడిపోయాయట.

గతంలో పలు సందర్బాల్లో పావురాల వ్యర్థాల వల్ల మనిషి ఆరోగ్యానికి హాని పొంచి ఉందని నిపుణులు చెప్పుకొచ్చారు. ఇప్పుడు మీనా భర్త అర్థాంతరంగా చనిపోవడం కు కారణం కూడా పావురాలు అయ్యి ఉంటాయని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. పోస్ట్ కరోనా సమస్యలు ఆయనకు ఉండి ఉంటాయి. కాని చనిపోయేంత ప్రమాదంగా మాత్రం పావురాల వ్యర్థాల వల్లే సంభవించి ఉంటుంది.

మీనా మృతి పట్ల ఇండస్ట్రీ వర్గాల వారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. తమిళ మరియు తెలుగు సినీ ప్రముఖులు పలువురు మీనా ను పరామర్శించారని తెలుస్తోంది. 2009 సంవత్సరంలో మీనా మరియు విద్యాసాగర్ ల వివాహం అయ్యింది. వీరికి ఒక పాప ఉంది.

ఆ పాప కూడా సినిమాల్లో నటించింది. విద్యా సాగర్ మీడియా ద్వారా ఎక్కువగా కనిపించింది లేదు. ఆయన మృతి ఇప్పుడు తెలుగు మరియు తమిళ సినీ వర్గాల్లో దుఃఖం ను మిగిల్చింది.