Begin typing your search above and press return to search.

టైటిల్‌ నే కాదు పోస్టర్‌ కూడా కాపీనే!!

By:  Tupaki Desk   |   27 Jan 2020 6:48 AM GMT
టైటిల్‌ నే కాదు పోస్టర్‌ కూడా కాపీనే!!
X
తమిళం లో సూపర్‌ స్టార్‌ విజయ్‌. ప్రస్తుతం అక్కడ విజయ్‌ నెం.1 స్టార్‌ గా దూసుకు పోతున్నాడు చేసిన ప్రతి సినిమా మినిమం 100 కోట్ల నుండి 200.. 250 కోట్ల వరకు వసూళ్లు చేస్తూనే ఉంది. తమిళనాట సూపర్‌ స్టార్‌ అయినా కూడా తెలుగు లో మాత్రం ఆయన్ను కనీసం ఒక స్టార్‌ హీరోగా కూడా గుర్తించడం లేదు. తమిళంలో ఆయన నటించిన ప్రతి సినిమా కూడా ఈ మద్య తెలుగులో విడుదల అవుతుంది. కాని ఏ ఒక్క సినిమా కూడా ఇక్కడ మినిమం వసూళ్లను రాబట్టలేక పోతుంది. తమిళనాట వందల కోట్లు వసూళ్లు చేస్తున్న విజయ్‌ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో పబ్లిసిటీ ఖర్చులను కూడా రాబట్టలేక పోతున్నాయి అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తుంటారు.

విజయ్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా లో ఎక్కువగా తెలుగు హీరోలను కామెంట్స్‌ చేస్తూ.. ట్రోల్స్‌ చేస్తూ ఉంటారు. దాంతో మన వారు ఈమద్య కాలంలో విజయ్‌ కి సంబంధించిన పాత ఫొటోలు మరియు వీడియోలను మీమ్స్‌ చేస్తూ పెద్ద ఎత్తున ట్రోల్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్‌ 'మాస్టర్‌' చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మాస్టర్‌ చిత్రంలో విజయ్‌ తో పాటు కీలక పాత్రలో విజయ్‌ సేతుపతి నటిస్తున్నాడు.

వీరిద్దరు కలిసి ఉన్న పోస్టర్‌ ను తాజాగా రిపబ్లిక్‌ డే సందర్బంగా విడుదల చేయడం జరిగింది. ఆ పోస్టర్‌ కు తమిళ ఫ్యాన్స్‌ ఫిదా అవుతుంటే తెలుగు నెట్టింట మాత్రం ట్రోల్స్‌ ఎదుర్కొంటుంది. రాజు గారి గది 3 పోస్టర్‌ ను కాపీ కొట్టి ఈ పోస్టర్‌ ను తయారు చేసినట్లుగా ఉంది అంటున్నారు. మెగాస్టార్‌ మూవీ టైటిల్‌ ను కాపీ కొట్టడమే కాకుండా తెలుగు సినిమాల పోస్టర్‌ లను కూడా కాపీ కొట్టడం ఏంటీ అంటూ విజయ్‌ తెలుగు యాంటీ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

కాస్త కొత్తగా సొంతంగా ఆలోచించండయ్యా అంటూ తమిళ ఫిల్మ్‌ మేకర్స్‌ కు మరియు విజయ్‌ కు మనవారు కొందరు సలహా ఇస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే మాస్టర్‌ సినిమాకు కూడా తెలుగులో పెద్దగా బిజినెస్‌ అయ్యేట్లు కనిపించడం లేదు అలాగే విడుదలైన తర్వాత వసూళ్లు వస్తాయనే నమ్మకం లేదు అంటూ ట్రేడ్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.