ఫోటో స్టోరీ: మాస్టర్ భామ మహా గ్లామరసం!

Mon May 25 2020 16:00:01 GMT+0530 (IST)

Photo Story: Master Heroine Glamorous!

సోషల్ మీడియాలో చాలామంది భామలు ఉంటారు.. కొందరు అదేపనిగా గ్లామరసం ఒలకబోస్తూ ఉంటారు కానీ అందరికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కదు.  కానీ కొందరికే ఎక్కువ గుర్తింపు దక్కుతుంది. ప్రస్తుతం అలాంటి బాటలోనే పయనిస్తున్న సౌత్ భామ మాళవిక మోహనన్. ఈ భామ తెలుగులో ఇంకా ఏ సినిమాలో నటించలేదు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి మాళవిక పేరు మాత్రం తెలిసే ఉంటుంది.ఎందుకంటే ఏదో ఒక అప్డేట్ తో నెటిజన్లపై గ్లామరస్ సర్జికల్ స్ట్రైక్స్ చేయడం అలవాటైపోయింది.  ఈ విషయంలో దిశా పటాని దగ్గర జూమ్ లో ఏమైనా ఆన్లైన్ క్లాసులు తీసుకుందేమో తెలియదు కానీ ఈమధ్య ఖాళీగా ఉండడంతో జోరు పెంచేసింది.  ఈమధ్య అదే ఊపులో ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో తళుకుబెళుకులున్న సిల్వర్ కలర్ పార్టీ గౌన్ ధరించి ఫోటోకు ఓ ఘాటు భంగిమ ఇచ్చింది.  ఆ హెయిర్ స్టైల్.. ఫేస్ లో ఎక్స్ ప్రెషన్ చూస్తే ఎలాంటి సోలో బ్రతుకే సో బెటర్ అనే వాడైనా వెంటనే సింగిల్ స్టేటస్ కు బైబై చెప్పేసి మింగిల్ కావడానికి రెడీ అవుతాడు.

ఇలాంటి ఫోటోలకు నెటిజన్లు ఎప్పుడైనా డంగైపోతారు. అసలే చాలామందికి గత కొద్దిరోజులుగా ఇంట్లో ఉండి ఉండి.. పిచ్చెక్కింది. ఆ పిచ్చి కాస్తా ఈ అమ్మడు దెబ్బకు పిచ్చి 2.0 గా రూపాంతరం చెందేలా ఉంది. ఇక ఈ మాళవిక ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ సినిమా 'మాస్టర్' లో హీరోయిన్ గా నటిస్తోంది.