Begin typing your search above and press return to search.

మాస్టర్‌ బర్త్‌ డే స్పెషల్‌... 65 సినిమాల స్పెషల్‌

By:  Tupaki Desk   |   19 Jun 2021 11:30 AM GMT
మాస్టర్‌ బర్త్‌ డే స్పెషల్‌... 65 సినిమాల స్పెషల్‌
X
సౌత్‌ లో స్టార్‌ హీరోల జాబితాలో విజయ్‌ ముందు వరుసలో ఉంటాడు. ఆయన ఈమద్య కాలంలో చేసిన ప్రతి సినిమ కూడా వంద కోట్లను మించి వసూళ్లు చేసింది. మినిమం వంద కోట్లు గ్యారెంటీ అన్నట్లుగా విజయ్‌ సినిమాలు ఉంటున్నాయి. ఆయన స్టార్ డమ్‌ మరియు ఆయన ఫ్యాన్‌ బేస్ ఏంటో ఆయన నటించిన మాస్టర్‌ సినిమా కలెక్షన్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా కూడా వసూళ్ల సునామి నమోదు అయ్యింది. అలాంటి విజయ్ బర్త్‌ డే అంటే అభిమానుల హంగామా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

విజయ్‌ బర్త్‌ డేకు మరో రెండు రోజులు సమయం ఉండగానే సోషల్‌ మీడియాలో హడా వుడి మొదలు అయ్యింది. కామన్‌ డీ నుండి మొదలుకుని ఫ్యాన్స్‌ మేడ్‌ పోస్టర్ ల వరకు కొన్ని వేల ట్వీట్స్ నెట్టింట సందడి చేస్తున్నాయి. కాని సెవన్ స్క్రీన్‌ స్టూడియో వారు ట్విట్టర్‌ ద్వారా అధికారికంగా విడుదల చేసిన పోస్టర్ మాత్రం చాలా స్పెషల్‌ గా ఉంది. ఈ పోస్టర్ లో విజయ్ ఇప్పటి వరకు నటించిన 64 సినిమాలకు సంబంధించిన లుక్‌ లతో పాటు ప్రస్తుతం నటిస్తున్న 65వ సినిమా లుక్ ను కూడా రివీల్‌ చేశారు.

65 సినిమాల్లో విజయ్‌ లుక్‌ ఎలా మారిందో ఇందులో చూడవచ్చు. సినిమా సినిమా కు అభిమానుల సంఖ్య పెంచుకుంటూ వస్తున్న విజయ్‌ సౌత్‌ లోనే టాప్‌ స్టార్‌ గా నిలిచాడు. బాలీవుడ్‌ హీరోల రేంజ్ లో పారితోషికం తీసుకోవడంతో పాటు.. సినిమా వసూళ్ల విషయంలో కూడా ఏమాత్రం తగ్గని సూపర్‌ స్టార్‌ కు బర్త్‌ డే సందర్బంగా సెవన్‌ స్క్రీన్‌ స్టూడియో వారు ఇచ్చిన ఈ ప్రత్యేక పోస్టర్‌ కు అభిమానులు కృతజ్ఞతలు చెబుతున్నారు.