Begin typing your search above and press return to search.

చిత్తూరు యాసలో మాస్ రాజా.. కొత్త సినిమా!

By:  Tupaki Desk   |   17 Jun 2021 4:30 AM GMT
చిత్తూరు యాసలో మాస్ రాజా.. కొత్త సినిమా!
X
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ.. కరోనా టైంలో బ్లాక్ బస్టర్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి క్రాక్ సినిమాతో మాస్ హిట్ అందుకున్న రవితేజ.. అదే ఉత్సాహంతో వరుసగా సినిమాలను లైన్ లో పెట్టేసాడు. లాక్డౌన్ తర్వాత ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కొట్టిన రవితేజ.. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా రూపొందిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రవితేజ - రమేష్ వర్మ కాంబినేషన్ లో సెకండ్ మూవీ. ఈ సినిమాలో మాస్ రాజా డ్యూయెల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ ఖిలాడి సినిమాను మే నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ కరోనా కారణంగా సినిమా ఇంకా పూర్తి కాలేదు.

అయితే ఈ సినిమా కాకుండా రవితేజ చేతినిండా సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఖిలాడి సినిమా తర్వాత యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శీనుతో ఒక సినిమా.. దర్శకుడు త్రినాథరావు నక్కినతో మరో సినిమా చేయనున్నట్లు టాక్ నడుస్తుంది. కానీ ఇంతవరకు ఏ ఒక్కటీ కన్ఫర్మ్ కాలేదు. ఇదిలా ఉండగా.. ఆల్రెడీ రవితేజ మరో డెబ్యూ డైరెక్టర్ తో సినిమా ప్రారంభించాడు. ఉగాది సందర్బంగా కొత్త దర్శకుడితో కొత్త సినిమా పూజా కార్యక్రమం ముగించాడు రవితేజ. పలు తెలుగు, తమిళ సినిమాలకు పనిచేసిన రచయిత శరత్ మండవ.. ఈ సినిమాతో దర్శకుడుగా మారబోతున్నాడు.

ఆల్రెడీ సినిమా షూటింగ్ సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కనుందని సమాచారం. ఇప్పటికే హీరోయిన్ గా మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ కన్ఫర్మ్ అయింది. ఈ సినిమాను చెరుకూరి సుధాకర్ నిర్మించనుండగా.. సామ్ సిఎస్ సంగీతం అందించనున్నాడు. అయితే తాజాగా సినిమాలో రవితేజ క్యారెక్టర్ గురించి ఓ వార్త హల్చల్ చేస్తోంది. రవితేజ ఇదివరకు అదిరిపోయే కామెడీ టైమింగ్ తో సినిమాలు చేసాడు. ఇప్పుడు ఇందులో కూడా రవితేజ అలాంటి ఫన్ క్యారెక్టర్ చేయనున్నట్లు తెలుస్తుంది. అలాగే మాట కూడా చిత్తూరు యాసలో ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్. చూడాలి మరి ఈ సినిమాతో మాస్ రాజా హిట్ ఫామ్ కంటిన్యూ చేస్తాడేమో!