మాస్ మహారాజా బర్త్ డే సర్ ప్రైజ్ రెడీ!

Tue Jan 24 2023 11:20:50 GMT+0530 (India Standard Time)

Mass Maharaja Ready With Birthday Surprise

మాస్ మహారాజా రవితేజ ఈ జనవరి 26న పుట్టిన రోజు వేడుకలు జరుపుకోబోతున్నారు. ఇది ఆయన 55వ పుట్టిన రోజు కావడం విశేషం. రీసెంట్ గా తను కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'ధమాకా' బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకోవడమే కాకుండా ఏకంగా రవితేజని వంద కోట్ల క్లబ్ లో చేర్చింది. ఈ మూవీ అందించిన సక్సెస్ జోష్ లో వున్న రవితేజ త్వరలో మరో మాసీవ్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'రావణాసుర'. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ నామతో కలిసి ఆర్ టీ టీమ్ వర్క్స్ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్స్ పై రవితేజ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. అను ఇమ్మాన్యుయేల్ మేఘా ఆకాష్ ఫరియా అబ్దుల్లా దక్షా నాగర్కర్ పూజితా పొన్నాడ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. సమ్మర్ లో ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. జనవరి 26న రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి బర్త్ డే సర్ ప్రైజ్ గా ఫస్ట్ గ్లిమ్స్ ని రిలీజ్ చేయబోతున్నారట.

ఈ నేపథ్యంలోనే రవితేజ అభిమానులు నెట్టింట సందడి చేయడం మొదలు పెట్టారు. గత సినిమాలకు పూర్తి భిన్నమైన పాత్రలో లాయర్ గా మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ఈ మూవీపై దర్శకుడు సుధీర్ వర్మతో పాటు హీరోయిన్ లు అను ఇమ్మాన్యుయేల్ మేఘా ఆకాష్ ఫరియా అబ్తుల్లా దక్షా నాగర్ర్కర్ పూజిత పొన్నాడ అంచనాలు పెట్టుకున్నారు. తొలిసారి ఈ మూవీలో దక్షా నాగర్కర్ ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ఈ మూవీ ప్రేక్షకుల్లోఆసక్తిని రేకెత్తిస్తోంది. విలక్షణమైన టైటిల్.. అందుకు తగ్గ రీతిలో రవితేజ మేకోవర్ అంచనాల్ని పెంచేస్తోంది. అంతే కాకుండా ఇటీవల సోలో గా 'ధమాకా' మూవీతో వంద కోట్ల క్లబ్ లో చేరడం.. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన 'వాల్తేరు వీరయ్య' కూడా 200 కోట్లు రాబట్టడం.. ఇందులో రవితేజ క్యారెక్టర్ మెయిన్ హైలైట్ గా నిలిచి సినిమాకు ఆయువు పట్టుగా నిలవడంతో రవితేజ నటిస్తున్న 'రావణాసుర'పై భారీ అంచనాలు మొదలయ్యాయి.

బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల మార్కు సినిమాలతో సక్సెస్ లని సొంతం చేసుకున్న మాస్ మహారాజా రవితేజ విలక్షణమైన క్యారెక్టర్ టైటిల్ తో రూపొందుతున్న'రావణాసుర'తో వస్తుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ మూవీపై పడింది. చాలా కాలంగా పవర్ ప్యాక్డ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న సుధీర్ వర్మ ఈ మూవీలో రవితేజని ఇంత వరకు చూడని సరికొత్త పాత్రలో సరికొత్త మేకోవర్ తో చూపించబోతున్నాడు. రవితేజ బర్త్ డే 26న జరగనున్న నేపథ్యంలో ఫస్ట్ గ్లిమ్స్ ని రిలీజ్ చేస్తూ మూవీ ప్రమోషన్స్ కి శ్రీకారం చుడుతున్నారు.

'ధమాకా'తో సక్సెస్ ని సొంతం చేసుకున్న భీమ్స్ సిసిరోలియో 'అర్జున్ రెడ్డి'కి నేపథ్య సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా స్టోరీ స్క్రీన్ ప్లే అందించారు. విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా కీలక పాత్రల్లో రావు రమేష్ మురళీశర్మ సంపత్ రాజ్ నటిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని ఏప్రిల్ 7న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. గ్లిమ్స్ కోసం కమెడియన్స్ ప్రవీణ్ సుదర్శన్ చర్చించుకుంటున్న వీడియోని చిత్ర బృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది.      నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.