Begin typing your search above and press return to search.

రవితేజ చేతిలో మరో యంగ్ డైరెక్టర్

By:  Tupaki Desk   |   25 May 2022 12:39 PM GMT
రవితేజ చేతిలో మరో యంగ్ డైరెక్టర్
X
మాస్ మహారాజా రవితేజ గత ఏడాది క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు వరకు వరుస అపజయాలతో సతమతమైన మాస్ మహారాజా మళ్లీ తనకు ఇష్టమైన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా చేసి హిట్ కొట్టాడు. అయితే ఆ సినిమా సక్సెస్ అనంతరం మళ్లీ ఎప్పటిలానే రవితేజ డిజాస్టర్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించిన ఖిలాడి సినిమా ఊహించిన విధంగా దెబ్బ కొట్టేసింది. ఆ సినిమా అనంతరం వీలైనంతవరకు మళ్ళీ రిస్క్ చేయకూడదని మంచి ప్రాజెక్టులను లైన్ లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

అయితే రవితేజ నుంచి తర్వాత రాబోతున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా దాదాపు కమర్షియల్ మూవీ అని తెలుస్తుంది. కానీ సినిమా తప్పకుండా వర్కౌట్ అవుతుందని రవితేజ నమ్ముతున్నాడు. అంతేకాకుండా మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా లో తెరకెక్కించే దర్శకుడు త్రినాధరావు నక్కిన తో కూడా ధమాకా అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రవితేజ లిస్టులో రావణాసుర అనే మరో సినిమా కూడా ఉంది.

ఆ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక వీటితో పాటు ఇటీవల రవితేజ ఒక కొత్త దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని రవితేజతో భిన్నమైన సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. తెలుగు చిత్ర పరిశ్రమలో కెమెరామెన్ గా చేసిన కార్తీక్ మొదట సూర్య వర్సెస్ సూర్య అనే సినిమాను డైరెక్ట్ చేశాడు.

నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా అంతగా వర్కవుట్ కాలేదు. కానీ దర్శకుడిగా అతని ప్రయత్నానికి మంచి ప్రశంసలు వచ్చాయి. అయితే ఇటీవల కార్తీక్ రవితేజకు కథను వివరించడంతో సింగిల్ సిట్టింగ్ లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక వీలైనంత త్వరగా మాస్ మహారాజా రవితేజ ఆ ప్రాజెక్ట్ పై అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. అలాగే రవితేజ మరో కొత్త దర్శకుడితో కూడా సినిమా చేసేందుకు చర్చలు మొదలు పెట్టినట్లు సమాచారం.